National Games: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది: మోదీ

New Update
National Games: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది: మోదీ

37వ జాతీయ క్రీడలు గోవాలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ క్రీడల్లో తమ సత్తా చాటేందుకు అథ్లెట్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జాతీయ గేమ్స్‌లో ఎన్నో ఈవెంట్లు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు పతకాల కోసం పోటీపడతారు. ప్రారంభ దశలో, బ్యాడ్మింటన్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ , నెట్‌బాల్ లాంటి క్రీడలు నిర్వహిస్తారు.


జాతీయ క్రీడలు ఎంతో అట్టహసంగా ప్రారంభయ్యాయి. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవగా క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2036 నాటికి మన దేశం ప్రధాన ఆర్థిక శక్తులలో ఒకటిగా ఉంటుందన్నారు మోదీ. భారత జెండా అంతరిక్షం నుంచి క్రీడల వరకు ఉంటుంది. అందుకే అప్పటికీ మనం ఒలింపిక్స్‌ను నిర్వహించే స్థాయికి వెళ్తామన్నారు మోదీ. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు మోదీ.

2014 తర్వాత, క్రీడా మౌలిక సదుపాయాలు, ఎంపిక ప్రక్రియ, క్రీడాకారులకు మద్దతు ఇచ్చే ఆర్థిక పథకాలలో మార్పు తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు చేసినట్లు చెప్పుకొచ్చారు మోదీ. క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు పథకాల్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఇటు నేషనల్‌ గేమ్స్‌ను హోస్ట్ చేస్తున్న గోవా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ. దేశానికి ఎందరో స్టార్ల అథ్లెట్లను అందించిన గడ్డ గోవా అని అన్నారు. గోవాలో పురాతన ఫుట్‌బాల్ క్లబ్‌లు ఉన్నాయని.. రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ క్రీడలు కొత్త శక్తిని నింపుతున్నాయని కొనియాడారు. దేశంలో క్రీడా ప్రతిభకు కొరత లేదని.. దేశం చాలా మంది ఛాంపియన్‌లను తయారు చేసిందని మెచ్చుకున్నారు.

Also Read: ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సచిన్‌ ఫ్రెండ్ ఘన విజయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు