ఫ్రీగా బస్ జర్నీ.. కట్ చేస్తే బస్ డోర్ కండక్టర్ చేతిలో!

ప్రయాణిస్తున్న బస్సులో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్‌గా మారింది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే శక్తి అనే పేరుతో జూన్ 11న లాంఛనంగా పథకాన్ని అమలు చేసింది. దీంతో బస్సు మహిళలతో కిక్కిరిసిపోయి బస్ డోర్ ఊడిపోయింది. ఏం చేయాలో తెలియక బస్ కండక్టర్ అలానే ఉండిపోయాడు.

New Update
ఫ్రీగా బస్ జర్నీ.. కట్ చేస్తే బస్ డోర్ కండక్టర్ చేతిలో!

national/fee-travel-effect-in-rtc-buses-women-who-broke-the-door-and-put-it-in-the-hands-of-the-conductor

కర్నాటక రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకొచ్చారు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చినట్టే అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే (శక్తి) అనే పేరుతో జూన్ 11న లాంఛనంగా ఈ పథకాన్ని అమలు చేసి అందరికి గుడ్ న్యూస్ తెలిపారు. ఈ పథకం కింద మహిళలు కర్నాటకలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.

ప్రయాణ సమయంలో ఐడీ ఫ్రూప్ కంపల్సరీ

అయితే ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తున్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును ఖచ్చితంగా కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే చాలామంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. బస్సులో ఫ్రీ జర్నీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు నిత్యం ఆర్టీసీ బస్సులో పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. దీంతో కర్నాటకలో ఆర్టీసీ బస్సులన్ని మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి.

పెద్ద సంఖ్యలో మహిళలు ఎక్కడంతో విరిగిన బస్ డోర్

ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ బస్సులో పెద్ద సంఖ్యలో మహిళలు ఎక్కడంతో బస్సు డోర్ విరిగిపోయింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆ డోర్‌ను కండక్టర్ చేతిలో పెట్టిన మహిళా ప్రయాణికులు బస్సును మాత్రం ఆపొద్దంటూ వాగ్వాదం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఫ్రీగా స్కీంలు అమలు చేయడం వల్లనే ఇలాంటి పరిస్ధితులు నెలకొంటాయని చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు