ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు... లోకల్ టెక్నిక్‌తో నిమిషాల్లో గోడను కట్టేశారు. కాయకష్టంతో చేసే పనులను అవలీలగా చేసేందుకు యంత్రాలతో పనిలేకుండా కొందరు వినూత్న మార్గాలతో కొత్త ఆలోచనలకు పదునుపెట్టి తమ పనులను సులభతరం చేసుకునేందుకు కొత్త టెక్నిక్‌ని తీసుకొస్తుంటారు. అవసరంతోనే ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయనేందుకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు... శ్రమజీవి కాయకష్టంతో చేసే పనులను అవలీలగా చేసేందుకు యంత్రాలతో పనిలేకుండా కొందరు వినూత్న మార్గాలతో తమ పనులను సులభంగా చేసేందుకు సరికొత్త ఆలోచనలతో సులభతరం చేసుకుంటున్నారు.
నిమిషాల్లోనే గోడను కట్టి టాలెంట్ ప్రూవ్
అయితే మన అవసరంతో మన ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయనేందుకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. నిమిషాల్లోనే గోడను కట్టి తమ టాలెంట్‌ని ప్రపంచానికి చూపెట్టారు. అంతేకాదు పని చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. నిత్యం సాధారణ వస్తువులతోనే అద్భుతమైన యంత్రాలను తయారుచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ మనకు నెట్టింట దర్శనమిస్తుంటాయి. అందులో ఇది టాప్‌లో ఉండి నెటిజన్ల చేత చప్పట్లు కొట్టించుకుంది. అంతేకాదు క్యా ఐడియా సర్‌జీ అంటూ తమ కామెంట్లతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
సోషల్‌మీడియాలో వైరల్
ఇక తాజాగా.. ఈ వీడియోను తన్సు యెజెన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోలో కొందరు నిర్మాణ రంగ కార్మికులు దేశీ యంత్రంతో అవలీలగా నిర్మాణ పనులను చేపట్టడం కనిపిస్తుంది. ఈ క్లిప్‌లో ఇద్దరు కార్మికులు చెక్క బల్లల చివరన కూర్చుండటం కనిపిస్తుంది.ఈ బల్ల వెనుక ఇద్దరు వ్యక్తులు నిలుచుని లిఫ్ట్ చేస్తుండగా ఓ వ్యక్తి ఇటుకను మరో వ్యక్తికి అందించడం ఆపై అతడు దాన్ని వేగంగా అందుకుని గోడపై ఉంచడం చూడొచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 19 లక్షలు పైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. దేశీ టెక్నిక్‌లు ఇలాగే ఉంటాయని పలువురు నెటిజన్లు కామెంట్ రూపంలో తెగ పొగడ్తలతో వారిని అప్రిషియేట్ చేస్తున్నారు.