త్రిపుర అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటుపడే ఛాన్స్‌

అధికార బీజేపీ ఎమ్మెల్యే అశ్లీల వీడియోలు చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం రోజు మధ్యాహ్నం భోజన విరామం సమయంలో పెద్ద రచ్చ జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం త్రిపుర రాష్ట్రం బాగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లక్‌నాథ్‌ గతంలో అసెంబ్లీలో పోర్న్‌ వీడియో చూసినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే అదే విషయాన్ని ప్రతిపక్షనేతలు లేవనెత్తారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది.

త్రిపుర అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటుపడే ఛాన్స్‌
New Update

బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లక్‌నాథ్‌ గతంలో అసెంబ్లీలో పోర్న్‌ వీడియో చూసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో అదే అంశాన్ని ప్రతిపక్ష టిప్ర మోతా పార్టీ ఎమ్మెల్యే అనిమేశ్‌ దెబ్బర్మ లేవనెత్తారు. దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు కూడా టిప్ర మోతా పార్టీ సభ్యులతో జత కలిసి అధికార బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు దూషించుకున్నారు. సభ్యుల అరుపులు, కేకలతో అసెంబ్లీ దద్దరిల్లింది.

అసలేం జరిగిందంటే..

త్రిపుర అసెంబ్లీలో.. బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ అడ్డంగా దొరికాడు. ఓవైపు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే.. ఈ ఎమ్మెల్యే తన మొబైల్‌లో ఫోర్న్ వీడియో చూసుకుంటూ కూర్చున్నాడు. అందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రతిపక్షాలతోపాటూ ప్రజలు కూడా ఆ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే వెనక ఉన్న ఎవరో.. ఎమ్మెల్యే బూతు వీడియో చూస్తుండటాన్ని తమ మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోని గమనిస్తే... ఎమ్మెల్యే కావాలనే, ఉద్ద్యేశపూర్వకంగానే వీడియో చూసినట్లుగా కనిపిస్తోందనే విమర్శలు భగ్గుమంటున్నాయి. సభలో వాడివేడిగా చర్చ జరుగుతుంటే.. ఈ ఎమ్మెల్యే తాపీగా పోర్న్ వీడియో చూడటమేంటని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్

సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు.. స్పీకర్ సీటులో కూర్చున్న వారు సుమోటోగా చర్యలు తీసుకోవాలి. కానీ త్రిపురలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా. దాంతో స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. "సోషల్ మీడియాలో రకరకాల విషయాలు వైరల్ అవుతున్నాయి. వాస్తవాలను కనుగొనకుండా, నేను దానిపై చర్య తీసుకోలేను. నాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదు" అని స్పీకర్ బిశ్వబందు సేన్ అన్నారు. దీన్ని బట్టే ఆయన ఎమ్మెల్యేని వెనకేసుకొస్తున్నారని అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఎమ్మెల్యేపై ప్రతిపక్షాల విమర్శ

బీజేపీ అధినాయకత్వం దీనిపై ఎమ్మెల్యేకి సమన్లు పంపింది. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సదరు ఎమ్మెల్యే స్పందించాడు. "నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత సడెన్‌గా ఓ వీడియో ప్లే అయ్యింది" అని తెలిపారు. ఇదంతా నమ్మశక్యంగా లేదని విపక్షాలు అంటున్నాయి. కాల్ వస్తే.. వీడియో ప్లే అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నాయి. తప్పు చేసింది చాలక.. దాన్ని సమర్థించుకోవడమేంటని నిలదీస్తున్నాయి. అసెంబ్లీ సమావేశం తర్వాత ఆ ఎమ్మెల్యే తాపీగా బయటకు వెళ్లాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe