Chandrayaan-3: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించిన నాసా చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండైన విక్రమ్ ల్యాండర్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA)కు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ లూనార్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్(LRO) గుర్తించింది. ఈ మేరకు ల్యాండర్‌ను ఫొటో కూడా తీసింది. By BalaMurali Krishna 06 Sep 2023 in నేషనల్ New Update షేర్ చేయండి చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండైన విక్రమ్ ల్యాండర్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA)కు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ లూనార్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్(LRO) గుర్తించింది. ఈ మేరకు ల్యాండర్‌ను ఫొటో కూడా తీసింది. ఈ విషయాన్ని ట్విట్టర్(ఎక్స్) ద్వారా నాసా తెలియజేస్తూ ఫొటోను షేర్ చేసింది. ఇస్రోకు చెందిన చంద్రయాన్-3 ఆగస్టు 23, 2023న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో దిగింది అని పేర్కొంది. అంతేకాకుండా 42 డిగ్రీల స్లీవ్ యాంగిల్‌లో LRO ఈ ఫొటో తీసిందని.. ల్యాండర్ చుట్టూ ప్రకాశవంతంగా కనిపిస్తోందని తెలిపింది. మేరీల్యాండ్‌లోని గ్రీన్‌ల్యాండ్ నుంచి LROను నాసాకు చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటుంది. .@NASA's LRO spacecraft recently imaged the Chandrayaan-3 lander on the Moon’s surface. The ISRO (Indian Space Research Organization) Chandrayaan-3 touched down on Aug. 23, 2023, about 600 kilometers from the Moon’s South Pole. MORE >> https://t.co/phmOblRlGO pic.twitter.com/CyhFrnvTjT — NASA Marshall (@NASA_Marshall) September 5, 2023 మంగళవారం విక్రమ్ ల్యాండర్(Vikram Lander) తీసిన అద్భుతమైన 3 డైమెన్షనల్ ‘అనాగ్లిఫ్’ ఫోటోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో విభిన్న రంగులతో అద్భుతంగా ఆకట్టుకుంది. ‘ఇక్కడ అందించిన ‘అనాగ్లిఫ్’.. నావ్‌క్యామ్(NavCam) స్టీరియో ఇమేజెస్‌ని ఉపయోగించి సృష్టించబడింది. ఇందులో ప్రజ్ఞాన్ రోవర్‌లో సంగ్రహించబడిన ఎడమ, కుడి వైపు లొకేషన్ కనిపిస్తోంది.’ అని పేర్కొంది. ‘అనాగ్లిఫ్’ అనేది వస్తువు, భూభాగానికి సంబంధించిన సాధారణ స్టీరియో, మల్టీవ్యూ ఇమేజెస్ విజువలైజేషన్. ఈ 3-ఛానల్ ఇమేజ్‌లో, ఎడమ చిత్రం ఎరుపు ఛానెల్‌లో.. కుడి చిత్రం నీలం, ఆకుపచ్చ ఛానెల్‌లలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల మధ్య దృక్కోణంలో వ్యత్యాసం స్టీరియో ఎఫెక్ట్‌కు కారణం అవుతుంది. ఈ ఫోటోను 3డిలో చూడటానికి ఎరుపు, సియాన్ గ్లాసెస్ ఉత్తమం అని ఇస్రో వెల్లడించింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 ఇకపోతే NavCam ను LEOS/ISRO అభివృద్ధి చేశాయి. డేటా ప్రాసెసింగ్‌ను SAC/ISRO నిర్వహిస్తుంది. ఇది స్పేస్ ఏజెన్సీకి చేరుతుంది. వాస్తవానికి సోమవారం ఉదయం 8 గంటలకు విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్‌లోకి సెట్ చేయడం జరిగిందని ఇస్రో ప్రకటించిన ఒక రోజు తరువాత ఈ ఫోటోలు విడుదల చేసింది. పేలోడ్‌ల ద్వారా సేకరించిన డేటా భూమికి అందిందని, పేలోడ్‌లు ఇప్పుడు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. సెప్టెంబర్ 22న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ మళ్లీ యాక్టీవ్ అవుతాయని అంచనా వేస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి