NASA: లూనా-25 కూలిన ప్రాంతంలో భారీ గొయ్యి.. గుర్తించిన నాసా

ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాల కోసం రష్యా స్పేస్‌ సెంటర్‌ ప్రయోగించిన లూనా-25 క్రాష్‌ అయిన ప్రాంతాన్ని అమెరికా స్పేస్‌ సెంటర్‌ నాసా గుర్తించింది.

New Update
NASA: లూనా-25 కూలిన ప్రాంతంలో భారీ గొయ్యి.. గుర్తించిన నాసా

ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాల కోసం రష్యా స్పేస్‌ సెంటర్‌ ప్రయోగించిన లూనా-25 క్రాష్‌ అయిన ప్రాంతాన్ని అమెరికా స్పేస్‌ సెంటర్‌ నాసా గుర్తించింది. లూనా-25 కూలిపోయిన చోట భారీ గుంట ఏర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ గొయ్యి దాదాపు 15 మీటర్ల పొడవుతో ఉన్నట్లు నాసా స్పష్టం చేసింది. దీనిని నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఫోటో తీసింది. రష్యా 47 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 11న చంద్రుడిపై ఉన్న దక్షిణ ధ్రువంపై ఉన్న రహస్యాలను తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేపట్టింది. అది చంద్రయాన్‌-3 కంటే ముందే చంద్రుడిపై దిగుతుందని రష్యా స్పష్టం చేసింది.

మరోవైపు ఇస్రో పంపిన చంద్రయాన్‌-3 ఆగస్ట్‌ 23న చంద్రుడిపై ల్యాండ్‌ అయింది. చంద్రుడిపై ల్యాండర్‌ ల్యాండ్‌ అయిన తర్వాత బయటకు వచ్చి చంద్రుడిని ముద్దాడిన రోవర్‌ అనేక కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. చంద్రుడిపై ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా భూమిపై సంభవించే ప్రకంపనల లాగానే చంద్రుడిపై కూడా ప్రకంపనలు కలుగుతాయని తేలినట్లు ఇస్రో తెలిపింది. “చంద్రయాన్-3 మిషన్: ఇన్-సిటు సైంటిఫిక్ ప్రయోగాలు – చంద్రయాన్ 3 ల్యాండర్‌పై లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ కోసం పరికరం – చంద్రునిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) టెక్నాలజీ ఆధారిత పరికరం – రోవర్ కదలికలను రికార్డ్ చేసింది. ఇతర పేలోడ్‌లు. అంతేకాకుండా ఇది ఆగస్టు 26, 2023న సహజంగా జరిగే ఈవెంట్‌ను రికార్డ్ చేసింది. ఈ ఈవెంట్‌పై పరిశోధన జరుగుతోంది” అని ఇస్రో(ISRO) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఎలా రికార్డ్ చేసింది:

నిజానికి చంద్రయాన్-3లోని విక్రమ్‌ ల్యాండర్‌లో ప్రకంపనలు రికార్డ్ చేసే పరికరాలున్నాయి. ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇతర పేలోడ్‌ల ఆధారంగా జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ఇస్రో చెబుతోంది. అంటే భూమిపై సహజంగా ఎలాగైతే ప్రకంపనలు వస్తాయో.. అలానే నేచురల్‌గా మూన్‌క్వేక్‌(Moon Quake)ని గుర్తించారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 మునుపెన్నడూ తెలియని జాబిల్లి విషయాలను ప్రపంచంతో పంచుకుంటోంది. ఇది ఇతర దేశాల సైంటిస్టులను కూడా ఆనందపెడుతోంది. సైన్స్ ముందుగుడు వేస్తుంటే ఎవరైనా చప్పట్లతో అభినందించాల్సిందే కదా!

Advertisment
తాజా కథనాలు