Hyderabad: భూవివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు నమోదు.. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై నార్సింగి పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. వీరిద్దరితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. By Shiva.K 23 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad News: హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై నార్సింగి పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. వీరిద్దరితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అసలేం జరిగింది..? కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై ఐపీసీ 447, 427 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Your browser does not support the video tag. గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం.. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. ‘‘గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు’’ అని ఫిర్యాదులో గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ పేర్కొన్నారు. Your browser does not support the video tag. Also Read: Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా? Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు.. Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్ #narsing-police-station #brs-mla-harshavardhan-reddy #mlc-venkat-ram-reddy #hyderabad-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి