Hyderabad: భూవివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు నమోదు..
హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై నార్సింగి పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. వీరిద్దరితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.