Infosys: 4 నెలల మనవడికి రూ.240 కోట్లు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు సంచలనం!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఈ షేర్లు కంపెనీ మొత్తం షేర్లలో 0.04 శాతం మాత్రమే. ఏకాగ్ర గతేడాది నవంబర్‌లో జన్మించాడు.

Infosys: 4 నెలల మనవడికి రూ.240 కోట్లు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు సంచలనం!
New Update

దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన మనవడిని అత్యంత పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా మార్చారు. నారాయణమూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్లకు పైగా విలువైన కంపెనీ షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు దేశంలోని యువ బిలియనీర్ల జాబితాలో ఎకాగ్రా పేరు చేరిపోయింది. ఈ షేర్లు కంపెనీ మొత్తం షేర్లలో 0.04 శాతం మాత్రమే. తాత ఇచ్చిన గిఫ్ట్‌తో ఏకంగా ఈ ప్రముఖ ఐటీ కంపెనీలో అతి పిన్న వయస్కుడైన షేర్‌హోల్డర్‌గా కూడా నిలిచాడు ఎకాగ్రా.

తగ్గిన వాటా:
స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి అందిన సమాచారం ప్రకారం, శుక్రవారం (మార్చి 15న) కంపెనీకి చెందిన 15 లక్షల షేర్లు నారాయణ మూర్తి హోల్డింగ్స్ నుంచి ఎకాగ్రాకు బదిలీ అయ్యాయి. ప్రస్తుత మార్కెట్ ధరను పరిశీలిస్తే, ఇన్ఫోసిస్ షేర్ రేటు దాదాపు రూ.1600. దీని ప్రకారం ఈ షేర్ల విలువ రూ.240 కోట్లు.నారాయణ మూర్తి తన ఒక కోటి 51 లక్షల షేర్లలో ఈ 15 లక్షల షేర్లను బదిలీ చేశారు. ఈ షేర్లను బదిలీ చేసిన తర్వాత కంపెనీలో నారాయణమూర్తి వాటా 0.40 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గింది. ఏకాగ్ర గతేడాది నవంబర్‌లో జన్మించాడు.

నారాయణ మూర్తి, ఆయనభార్య సుధా మూర్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు రోహన్ మూర్తి. కూతురు పేరు అక్షత. కుమారుడు రోహన్‌కి అపర్ణ కృష్ణన్‌తో వివాహమైంది. రోహన్ సోదరి అక్షత ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్న రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు. అక్షత, రిషిలకు కవల కుమార్తెలు. గత వారమే సుధా మూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఇక మూర్తి, మరో ఆరుగురు సహ-వ్యవస్థాపకులతో కలిసి 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. 1989లో సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారుని వదిలి USలో స్థిరపడిన అశోక్ అరోరా మినహా, సహ వ్యవస్థాపకులందరూ బిలియనీర్లు అయ్యారు.

Also Read: ‘ఆజాన్ కోసం నీ భజన ఆపు..’ దుకాణదారుడిపై దాడి!

#infosys
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe