Chandrababu Arrest: 'బరువెక్కిన గుండెతో రాస్తున్న'.. తెలుగు ప్రజానికానికి నారా లోకేష్ లేఖ..

చంద్రబాబు అరెస్ట్‌తో ఆయన కుమారుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ ఆవేదనతోనే తెలుగు ప్రజానికానికి బహిరంగ లేఖ రాశారు. తనకు తోడుగా ఉండాలంటూ కోరారు.

Chandrababu Arrest: 'బరువెక్కిన గుండెతో రాస్తున్న'.. తెలుగు ప్రజానికానికి నారా లోకేష్ లేఖ..
New Update

Chandrababu Arrest: 'బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన కళ్లతో ఈరోజు మీకు రాస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh), తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయాన్ని, ఆత్మను ధారపోస్తూ నేను పెరిగాను. లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న ఆయనకు విశ్రాంతి అనేదే తెలియదు. ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయితీతో కూడుకొని ఉన్నాయి. ఆయన సేవ చేసిన వారి ప్రేమ, కృతజ్ఞత నుండి ఆయన పొందిన లోతైన ప్రేరణను, సంతోషాన్ని నేను స్వయంగా చూశాను. వారి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపింది. పసి పిల్లల మాదిరిగా ఆనందించేవారు.'

'నేను కూడా ఆయన గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందాను. ఆయన అడుగుజాడలను అనుసరించాను. అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు, అన్నింటికి మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది.'

'అయినప్పటికీ, ఈ రోజు, మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది. నా రక్తం ఉడికిపోతుంది. రాజకీయ పగ ముంచే లోతులకు హద్దులు లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎన్నో గొప్ప పనులు చేసిన నాన్నగారి స్థాయి వ్యక్తి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఆయన ఎప్పుడూ పగ, విధ్వంసక రాజకీయాలకు పాల్పడనందుకా? తన విజనరీ ఆలోచనతో మన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను ఊహించినందుకా?'

'ఈరోజు నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు, నేనూ అలాగే.. ఆంధ్ర ప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.' అంటూ నారా లోకేష్ తెలుగు ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు.


Also Read:

Chandrababu Arrest Live Updates: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే..

Minister Roja: ‘నా ఉసురు తగిలింది’.. చంద్రబాబుపై రోజా సంచలన కామెంట్స్..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe