ఉద్యమాంధ్రప్రదేశ్‌గా ఏపీ.. పోరాడితే పోయేది బానిస సంకెళ్లే.. వైసీపీ సర్కార్ తీరుపై లోకేశ్ ట్వీట్ ఏపీలో సీఎం జగన్ పాలనను ప్రశ్నిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రీశ్రీ కవితను జోడిస్తూ లోకేశ్ ట్విట్టర్‌లో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. By Naren Kumar 26 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Nara Lokesh: ఏపీలో సీఎం జగన్ పాలనను ప్రశ్నిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రీశ్రీ కవితను జోడిస్తూ లోకేశ్ ట్విట్టర్‌లో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన ట్విట్టర్ లో.. ‘‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి. ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టిడిపి పూర్తి స్థాయి మద్దతు ఇస్తోంది. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం… — Lokesh Nara (@naralokesh) December 26, 2023 ‘గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం శోచనీయం. మినిమమ్ టైం స్కేల్ విషయంలో జీవోల మీద జీవోలు ఇచ్చి అమలు చేయకపోవడం, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే చర్యలకు పాల్పడటం దారుణం. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలియజేస్తోంది. సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.’ అంటూ మరో ట్వీట్ చేశారు. గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం శోచనీయం. మినిమమ్ టైం స్కేల్ విషయంలో జీవోల మీద జీవోలు ఇచ్చి అమలు చేయకపోవడం, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే చర్యలకు పాల్పడటం దారుణం. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు… pic.twitter.com/6leP91335o — Lokesh Nara (@naralokesh) December 26, 2023 #lokesh-nara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి