Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..

తన తండ్రి నారా చంద్రబాబు నాయుడిని చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలో అరెస్ట్ చేయించి, జైల్లోనే అంతమొందించే కుట్రలు చేస్తున్నారని, తాజా పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని అన్నారు.

Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..
New Update

Chandrababu Naidu Arrest Updates: తన తండ్రి నారా చంద్రబాబు నాయుడిని చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలో అరెస్ట్ చేయించి, జైల్లోనే అంతమొందించే కుట్రలు చేస్తున్నారని, తాజా పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్.. 'సైకో జగన్.. చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. చంద్రబాబుకి జైలులో భద్రత లేదు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్‌ దే బాధ్యత' అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది..

రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఘటన చాలా బాధాకరం అన్నారు. సభ నియంతృత్వ ధోరణిలో జరిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా రాష్ట్రాంగా మంచి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అని, చంద్రబాబుపై కేసు పెట్టడం దారుణమన్నారు. కక్ష సాధింపు వైఖరే సీఎం పాలన అని విమర్శించారు బాలయ్య. జగన్ జైల్లో ఉన్నాడని, చంద్రబాబును కూడా జైల్లో ఉంచాలన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ గురించిదేశంలో, ఇతర దేశాల్లోనూ చర్చ జరుగుతోందన్నారు. ఇవాళ ప్రజలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లా్ల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. స్కిల్ స్కాంలో ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చెయ్యలేదని బాలకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్కడా సంతకం చేయలేదని, షెల్ కంపెనీలు లేవన అన్నారు బాలకృష్ణ. ఇలాంటి సంక్షోభాలు ఎన్నో‌ టీడీపీ చూసిందన్నారు.

'ములాఖత్ సమయంలో చంద్రబాబును చూశా.. ఆయన తప్పు చెయ్యలేదు కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నారు. బ్యూరోక్రాట్లు కూడా ఇష్టం లేకపోయినా బలవంతంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు భద్రత లేదు.. ప్రజలకు భద్రత లేదు.. ప్రతిపక్ష నేతకు భద్రత లేదు. ఇక సహించి లాభం లేదు.. జనం బయటకు వస్తారు. ఎక్కడచూసినా గంజాయి.. లిక్కర్.. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. మళ్లీ జగన్ ను ఎన్నుకుంటే అందరూ రాష్ట్రం వదిలాల్సిందే. అంబటి రాంబాబు నా వృత్తిని‌ అవమానించారు. మీసం తిప్పి తొడకొట్టారు. నేను కూడా తేల్చుకుందాం రా అన్నాను.' అంటూ ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు బాలకృష్ణ.

Also Read:

Andhra Pradesh: బాలకృష్ణా.. నీ ఫ్లూటు అక్కడ ఊదు.. మంత్రి రోజా మాస్ వార్నింగ్..

alert message: మీ ఫోన్లలో అలెర్ట్ ఎసేజ్ వచ్చిందా? ఎందుకో తెలుసా?

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe