జగన్ టార్గెట్ గా నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. పందికొక్కులా ఇసుక తింటుంది ఎవరంటూ మండిపడ్డారు జగన్. గన్నవరంలో నియోజకవర్గంలో ప్రసంగించిన లోకేశ్ వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
గన్నవరం బహిరంగ సభలో నారా లోకేష్ ఏం అన్నారంటే:
➼ చిత్తూరు చిందేసింది, అనంతపురం అదిరిపోయింది, కర్నూలు కదం తొక్కింది, కడప కేక పుట్టింది , నెల్లూరు నాటు దెబ్బ సూపర్, ప్రకాశం లో జనసునామి, గుంటూరు గర్జించింది, ఇప్పుడు కృష్ణా జనసంద్రంగా మారిపోయింది. ఈ జనసంద్రంలో జగన్ కొట్టుకుపోవడం ఖాయం.
➼ ఉద్యమాల వాడ బెజవాడ.
➼ అందరినీ చల్లగా చూసే దుర్గమ్మ ఆలయం ఉన్న పుణ్యభూమి కృష్ణా జిల్లా.
➼ మేరిమాత కొలువైన కొండ గుణదల.
➼ పాడిపంటలు, సిరులు అందించిన కృష్ణమ్మ పారే నేల కృష్ణా జిల్లా.
➼ ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య ఈ భూమి పై పుట్టారు.
➼ తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు జన్మించిన గడ్డ కృష్ణా జిల్లా.
➼ ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ ఒకేసారి ఎత్తినట్టు.. యువగళం జన ప్రవాహంలా పొంగింది.
➼ కృష్ణా జిల్లా మనవడిగా, అల్లుడిగా ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
➼ యువగళం..మనగళం..ప్రజాబలం.
➼ జగన్ పిరికోడు, జగన్ అంత పిరికోడిని నేను ఎక్కడా చూడలేదు.
➼ జగన్ పాదయాత్ర చేసినప్పుడు మనం అడ్డుకోలేదు.
➼ సెక్యూరిటీ పెంచి పాదయాత్ర చేసుకోమని చెప్పాం.
➼ కానీ మీ లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన వెంటనే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
➼ పోలీసుల్ని పంపాడు మనం తగ్గేదేలేదు అన్నాం.
➼ మైక్ వెహికల్ లాక్కున్నాడు. మా తాత ఎన్టీఆర్ గారి గొంతు ఇది. ఆపే మగాడు పుట్టలేదు, పుట్టడు.
➼ గుడ్లు, రాళ్లు వెయ్యమని పిల్ల సైకోలని పంపాడు. మన వాళ్లు ఆమ్లెట్ వేసి పంపారు.
➼ ఇప్పుడు మళ్లీ ఫ్లెక్సీ కట్టనివ్వం, బ్యానర్లు చింపుతాం, సెక్యూరిటీ ఇవ్వం అంటున్నారు సన్నాసులు.
➼ బ్రదర్ జగన్ భయం నా బ్లడ్ లో లేదు. అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతాం.
➼ నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర.
➼ లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగన్ కి కాళ్ళు నొప్పులు వచ్చాయి.
➼ మనకి వీక్ ఆఫ్ లేదు, జగన్ లా వారానికి మూడు రోజులు కోర్టు పేరుతో రెస్ట్ లేదు అయినా మన బండి ఆగదు.
➼ మరి జగన్ కి కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి.
➼ జగన్ మొన్న నాయకులతో మీటింగ్ పెట్టుకున్నాడట.
➼ ఆ మీటింగ్ లో ఉన్న ప్యాలస్ బ్రోకర్ సజ్జల ని పిలిచి టివి పెట్టమన్నాడట.
➼ ఏ ఛానెల్ పెట్టినా యువగళం జన ప్రభంజనం వార్తలే వస్తున్నాయి అంట.
➼ అది చూసి జగన్ కి కోపం వచ్చి అక్కడే ఉన్న టేబుల్ ని గట్టిగా తన్ని టివి ఆఫ్ చెయ్యమని చెప్పాడట.
➼ కాలు నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గర కి వెళ్లి అన్ని టెస్టులు చేయించాడట రిపోర్టులు అన్ని నార్మల్ అని వచ్చాయి.
➼ అదేంటి డాక్టర్ అన్ని నార్మల్ ఉన్నాయి నాకేమో కాలు నొప్పి తగ్గడం లేదు అన్నారు.
➼ డాక్టర్ వెంటనే మీరు ఎన్నికల ముందు ఏమి అన్నారో గుర్తుందా అని అడిగారు? మాట తప్పను, మడమ తిప్పను అన్నారు.
➼ నాలుగేళ్ళ మూడు నెలలు గా ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ప్రతి రోజు మడమ తిప్పుతూనే ఉన్నారు. అందుకే నొప్పి తగ్గడం లేదు సార్ అన్నాడు.
➼ కృష్ణా జిల్లా ప్రజలకు ఒక చిన్న క్విజ్ పెడతాను. జగన్ రోజూ ఎం తింటాడు?
➼ ఆప్షన్1. బిర్యానీ, ఆప్షన్2. అన్నం, ఆప్షన్3. ఇసుక.
➼ పందికొక్కులా ఇసుక తింటుంది ఎవరు? జగన్.
➼ కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది ఎవరు?జగన్.
➼ టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక ఎంత?రూ.1500.
➼ జగన్ హయాంలో ట్రాక్టర్ ఇసుక ఎంత?రూ.5000.
➼ రోజుకి ఇసుకలో జగన్ దోపిడీ ఎంతో తెలుసా?రూ.3 కోట్లు, నెలకి రూ.90 కోట్లు, సంవత్సరానికి రూ.1080 కోట్లు, ఐదేళ్లకి రూ.5400 కోట్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరెన్ ధరలు తగ్గిస్తాం.
తిరుమల నడకదారిపై లోకేశ్ కామెంట్స్:
జగన్ ఒక్క కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పధకం పేరు ఏంటో తెలుసా? సైకో కర్రల పథకం అంటూ లోకేశ్ నిప్పులు చెరిగాడు. తిరుమల నడకదారిలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిందని.. సొల్యూషన్ చెప్పకుండా నడకదారి మూసేస్తాం అని ఈవో అంటాడన్నారు. లక్షిత తల్లిదండ్రులపై అనుమానం ఉందని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటారంటూ లోకేశ్ ఫైర్ అయ్యారు. చిన్నారి లక్షిత ప్రాణానికి రూ.10 లక్షలు రేటు కట్టారని జగన్‌పై మండి పడ్డారు లోకేశ్. టిటిడి ఛైర్మెన్ భూమన కరుణా కర్ర రెడ్డి భక్తులకు కర్రలు ఇస్తాడట అంటూ సెటైర్లు వేశారు. ఒక ఛాలెంజ్ విసురుతున్నానని.. తాడేపల్లి ప్యాలస్‌లో పులిని వదులుతాం.. జగన్, కరుణా కర్ర రెడ్డి కర్రలతో పులిని తరమాలి? ఛాలెంజ్ కి సిద్ధమా అంటూ ఫైర్ అయ్యారు.