Lokesh-Amit Shah: అమిత్ షాతో లోకేష్ భేటీ.. కేంద్ర హోంమంత్రి దృష్టికి చంద్రబాబు అరెస్ట్‌ అంశం..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గత నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

New Update
Lokesh-Amit Shah: అమిత్ షాతో లోకేష్ భేటీ.. కేంద్ర హోంమంత్రి దృష్టికి చంద్రబాబు అరెస్ట్‌ అంశం..

Nara Lokesh Meets Home Minister Amit Shah: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమరావతి నుంచి సాయంత్రం 6 గంటలకు స్పెషల్ ఫ్లైట్‌లో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఆయన.. అమిత్‌ షా‌ను కలిశారు. ఈ భేటీలో చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనను వేధిస్తున్న తీరును అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు లోకేష్. చివరకు తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారాయన. ఈ సందర్భంగా రెస్పాండ్ అయిన షా.. చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అంటూ లోకేష్ ని ఆరా తీసినట్లు సమాచారం. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి లోకేష్ వివరించినట్లు తెలుస్తోంది. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా సైతం అభిప్రాయపడినట్లు సమాచారం అందుతోంది. అలాగే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర హోంమంత్రి. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నానని లోకేష్‌కు చెప్పారట. కాగా, ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!

ఇదిలాఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో అమరావతిలో రెండు రోజుల సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఇవాళ సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్లారు లోకేష్. అక్కడికి చేరుకున్నాక నేరుగా అమిత్‌ షాను కలిశారు.

Also Read: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు