Nara Lokesh CID: రేపు మరోసారి సీఐడీ విచారణకు నారా లోకేష్.. విచారణ తర్వాత సంచలన ప్రెస్‌మీట్

ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు ఆయన విచారణ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే.. రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీంతో రేపు మరో సారి సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.

Nara Lokesh CID: రేపు మరోసారి సీఐడీ విచారణకు నారా లోకేష్.. విచారణ తర్వాత సంచలన ప్రెస్‌మీట్
New Update

ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ (Nara Lokesh) సీఐడీ విచారణ ముగిసింది. రేపు మరోసారి విచారణకు రావాలని లోకేష్ కు సీఐడీ అధికారులు (AP CID) నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన రేపు మళ్లీ అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రానున్నారు. విచారణ అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. తనకు ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగారన్నారు. 50వ ప్రశ్నగా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన మీ మంత్రి వర్గం ముందుకు వచ్చిందా? అని అడిగారన్నారు. తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారని లోకేష్ చెప్పారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో తాను కానీ, తన కుటుంబం కానీ ఎలా లబ్ధి పొందుతాం అని ప్రశ్నించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్థావనే తన దగ్గరకు రాలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే సీఐడీ కాలయాపన చేస్తోదని ఆరోపించారు. ఇంకా ప్రశ్నలున్నాయి.. మీరు రేపు మరోసారి రండి అని దర్యాప్తు అధికారులు కోరారన్నారు.
ఇది కూడా చదవండి: స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మరో షాక్

నేను ఎంత టైమ్ అయినా పర్వాలేదు.. ఈరోజే ప్రశ్నలు అడగండని కోరానన్నారు. కేవలం కాలయాపన చేయడానికే విచారణ మరో రోజు పొడిగించారన్నారు. రేపు మళ్లీ విచారణకు హాజరై.. విచారణకు సహకరిస్తాన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మీరు ఏఏ పదవులు చేశారు? హెరిటేజ్ లో మీరు ఎలాంటి పదవుల్లో ఉన్నారు? అంటూ గూగుల్ లో ఉన్న సమాచారాన్నే ప్రశ్నలుగా తిప్పి తిప్పి అడిగారని అన్నారు. అన్నీ జనరల్ క్వశ్చన్స్ నే అడిగారన్నారు. తన పేరు గూగుల్ లో కొట్టినా ఆ సమాచారం తెలుస్తుందన్నారు. అడిగిన ప్రతీ ప్రశ్నకు తాను సమాధానం చెప్పానన్నారు.

ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన విచారణ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో 6 గంటల పాటు లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ప్రతిపాదిత రింగ్ రోడ్ సమీపంలో హెరిటేజ్ భూములు కొనుగోలు, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి లో పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు పై సీఐడీ లోకేషన్ ను ప్రశ్నించినట్లు సమాచారం. దాదాపు అనేక ప్రశ్నలకు.. నాకు తెలియదు అని లోకేష్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు విషయంలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ రోజు జరిగిన విచారణకు నారా లోకేష్ సహకరించలేదని సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

#chandrababu-arrest #nara-lokesh-cid-inquiry #amaravati-inner-ring-road-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి