Bhuvaneswari: నేను కోరుకున్నట్లుగానే జరిగింది.. భువనేశ్వరి సంచలన ట్వీట్.!

సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకుందని పేర్కొన్నారు.

New Update
Bhuvaneswari: నేను కోరుకున్నట్లుగానే జరిగింది.. భువనేశ్వరి సంచలన ట్వీట్.!

Nara Bhuvaneswari: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సతీమణి నారా  భువనేశ్వరి సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశానని..బాధలు విన్నానని..ఇబ్బందులు తెలుసుకున్నానని అన్నారు. అణచివేతను అర్థం చేసుకున్నానన్నారు. తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజా పాలన మొదలైందని.. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్నంత సంతోషంలో ఉన్నారని పేర్కొన్నారు.

మంచే జరుగుతుంది..

స్వేచ్ఛగా మాట్లాడుతున్నారని.. తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారని.. నాడు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ..తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారని చెప్పుకొచ్చారు. నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలిక పడ్డాయన్నారు. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తు పై ధైర్యంగా ఉన్నారని.. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయని.. ఇది తన మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుందన్నారు.

Also Read: వారిని వదిలిపెట్టేదే లేదు.. స్పీకర్ అయిన తరువాత జరిగేది ఇదే: అయ్యన్న

చీకట్లు తొలగిపోయాయి..

కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పాలనలో అమరావతి (Amaravati) రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందని.. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయన్నారు. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుందన్నారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నెరవేరుతుందన్నారు.

పణంగా పెట్టి..

ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని.. ప్రజలే సుప్రీం అని చాటి చెప్పిన తిరుగులేని తీర్పుతో ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువుదీరుతుందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకుందని ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు