/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tdp-3-jpg.webp)
Bhuvaneswari Nijam Gelavali Yatra: ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali)పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. మొదటి విడతగా మూడు నియోజకవర్గాలలో మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. నిన్న సాయంత్రం తిరుపతి చేరుకున్న నారా భువనేశ్వరి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నేరుగా స్వగ్రామం నారావారిపల్లెకు (Naravaripalli) చేరుకోనున్నారు. నారావారిపల్లెలోని తమ కులదైవం నాగాలమ్మ, గ్రామ దేవత దొడ్డి గంగమ్మ లకు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు నారా భువనేశ్వరి. ఇవాళ రాత్రి స్వగ్రామంలోనే బస చేయనున్నారు.
Also Read: వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన వ్యాక్సిన్ వేస్తాం: పవన్, లోకేష్ సంచలన ప్రెస్‌మీట్
చంద్రబాబు అక్రమ అరెస్టుతో (Chandrababu Arrest) మరణించిన నేండ్రగుంటకు చెందిన చిన్నసామినాయుడు కుటుంబాన్ని రేపు పరామర్శించనున్నారు నారా భువనేశ్వరి. ఐతేపల్లి మండలంలోని ఎస్సి కాలనీ పల్లె ప్రజలతో రేపు మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం తర్వాత భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు సమాచారం. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు చంద్రగిరి సమీపంలోని అగరాల గ్రామ హైవే వద్ద జరగనున్న భారీ బహిరంగ సభలో భువనేశ్వరి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. రేపటి బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని టీడీపీ (TDP) శ్రేణులు చెబుతున్నారు. 25న చంద్రగిరి, 26న తిరుపతి, 27న శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో నారా భువనేశ్వరి బస్సు యాత్ర నిర్వహించనున్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా 26న మహిళా ఆటో డ్రైవర్లతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.
నిజం గెలవాలి కార్యక్రంలో బాగస్వాములవుదాం...
నీతిని... నిజాయితీని గెలిపిద్దాం ✌🏻✌🏻✌🏻#NIJAMGELAVALI pic.twitter.com/bTLWJ1mKtF— Saranya (@Saranya_abburi) October 23, 2023
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే విజనరీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తునే ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అయిన రెండు రోజుల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టీడీపీతో పొత్తు ఉన్నట్లు ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.
Also Read: వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన వ్యాక్సిన్ వేస్తాం: పవన్, లోకేష్ సంచలన ప్రెస్‌మీట్