Bhuvaneswari: అన్నవరంలో నారా భువనేశ్వరి, బ్రహ్మణికి తప్పని తిప్పలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కోసం భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణికి తిప్పలు తప్పడం లేదు. అక్రమ కేసు నుంచి బయట పడాలని వారు చెయ్యని పూజ లేదు.. మెక్కని దేవుడు లేడు. ఏ దేవుడైనా కరుణించకపోడా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నే ఉన్నారు. తాజాగా, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలో భువనేశ్వరి, బ్రహ్మణిలు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించనున్నారు.

New Update
Bhuvaneswari: అన్నవరంలో నారా భువనేశ్వరి, బ్రహ్మణికి తప్పని తిప్పలు..!!

Nara Bhuvaneswari: టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) కోసం భార్య నారా భువనేశ్వరి(Bhuvaneswari), కోడలు బ్రహ్మణి(brahmani)కి తిప్పలు తప్పడం లేదు. అక్రమ కేసు నుంచి బయట పడాలని వారు చెయ్యని పూజ లేదు.. మెక్కని దేవుడు లేడు. ఏ దేవుడైనా కరుణించకపోడా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నే ఉన్నారు. తాజాగా, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అక్రమ కేసు నుంచి చంద్రబాబు బయట పడాలని సత్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలో భువనేశ్వరి, బ్రహ్మణిలు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించనున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యే రాజప్ప, జ్యోతుల నవీన్, తుని ఇంచార్జీ యనమల దివ్య, ప్రత్తిపాడు టీడిపి ఇంచార్జీ సత్య ప్రభ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. అనంతరం, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలో భువనేశ్వరి, బ్రహ్మణిలు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు 13వ రోజు కొనసాగుతున్నాయి. తెలుగు మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వైసీపీ పాలనపై దుమ్మెత్తిపొస్తున్నారు. సైకో పోవాలి..సైకిల్ రావాలి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. చెవులు, నోరు, కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని పలుచోట్ల టీడీపీ శ్రేణులు వినూత్నంగా నిరసన చేపట్టారు. సంఘీభావంగా పాల్గొని మేము సైతం బాబుతో అంటూ మద్దతు తెలిపారు.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరుగనుంది. అటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు, ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు విచారించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డ కేసులో పిటి వారెంట్‌తో పాటు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. చంద్రబాబు కస్టడీపై పిటిషన్ దాఖలు చేయనున్నారు సీఐడీ తరఫున న్యాయవాదులు.

Also Read: చంద్రబాబు నాయుడు కేసుల అప్‌డేట్స్.. ఏ కోర్టులో ఏ కేసు విచారణ జరుగనుందంటే..

Advertisment
తాజా కథనాలు