Nijam Gelavali: నేటి నుంచే నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.

Nijam Gelavali: నేటి నుంచే నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
New Update

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) నేటి నుంచి 'నిజం గెలవాలి' (Nijam Gelavali) పేరిట యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజులు పాటు భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను (Chandrababu Arrest) ఖండిస్తూ భువనేశ్వరి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. ఉదయం 10.30 గంటలకు నారావారిపల్లె నుంచి బాధిత కుటుంబాల వద్దకు భువనేశ్వరి వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?

చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది గత నెల 25న చనిపోయిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ కుటుంబాన్ని భువనేశ్వరి పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఈ నెల 17న మరణించిన చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Minister Roja: భువనేశ్వరి కోరుకున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే.. మంత్రి రోజా సైటర్లు!

గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగనుంది. భువనేశ్వరి యాత్ర నేపథ్యంలో ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. భువనేశ్వరి తొలిసారి ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో యాత్రపై ఆసక్తి నెలకొంది.

#tdp #chandrababu-arrest #nara-bhuvaneswari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe