/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nijam-Gelavali-Yathra-jpg.webp)
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) నేటి నుంచి 'నిజం గెలవాలి' (Nijam Gelavali) పేరిట యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజులు పాటు భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను (Chandrababu Arrest) ఖండిస్తూ భువనేశ్వరి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. ఉదయం 10.30 గంటలకు నారావారిపల్లె నుంచి బాధిత కుటుంబాల వద్దకు భువనేశ్వరి వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?
చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది గత నెల 25న చనిపోయిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ కుటుంబాన్ని భువనేశ్వరి పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఈ నెల 17న మరణించిన చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Minister Roja: భువనేశ్వరి కోరుకున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే.. మంత్రి రోజా సైటర్లు!
నిజం గెలవాలి! #NijamGelavali pic.twitter.com/TkfiYLuMiC
— Telugu Desam Party (@JaiTDP) October 24, 2023
గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగనుంది. భువనేశ్వరి యాత్ర నేపథ్యంలో ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. భువనేశ్వరి తొలిసారి ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో యాత్రపై ఆసక్తి నెలకొంది.