Andhra Pradesh: యువగళం వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిది.. నారా భువనేశ్వరి..

నారా లోకేష్ చేపట్టిన యువగళం ద్వారా పార్టీకి సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని నారా భువనేశ్వరి అన్నారు. యవగళంలో లోకేష్ తో పాటు సాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆమె అన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు.

Nara Bhuvaneshwari: జగన్‌ పాలనలో మహిళలకు భద్రత కరవు.. భువనేశ్వరి ఆగ్రహం
New Update

Yuvagalam Volunteers: నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) ద్వారా పార్టీకి సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని నారా భువనేశ్వరి అన్నారు. యవగళంలో లోకేష్ తో పాటు సాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆమె అన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని యువగళం పాదయాత్ర ప్రారంభం నుండి లోకేష్ కు వెన్నంటి ఉంటున్న యువగళం వాలంటీర్లకు భువనేశ్వరి కృతజ్ఞతలు చెప్పారు. భీమవరం నియోజకవర్గం, గునుపూడిలో యువగళం పాదయాత్రపై నాటి ఘటనలో 43 మంది వాలంటీర్లపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. నెల రోజులుగా జైల్లో ఉన్న వీరు ఈ రోజు బెయిల్ పై విడుదల అయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చిన వాలంటీర్లను నారా భువనేశ్వరి కలుసుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసున్నారు.

publive-image

చేయని నేరానికి జైలుకు వెళ్లడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల కష్టం, త్యాగం తాము ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామని భువనేశ్వరి అన్నారు. వాలంటీర్లతో భువనేశ్వరి మాట్లాడుతూ...‘‘వాలంటీర్లపై అక్రమ కేసులు మమ్మల్ని ఎంతో బాధించాయి. మీరు జైలు నుండి విడుదల అవుతున్నారని తెలియగానే మిమ్మల్ని చూడాలని చెప్పా. దాడి చేసిన వారిని వదిలిపెట్టి మిమ్మల్ని అకారణంగా జైల్లో పెట్టారు. పార్టీకి మీరు చేస్తున్న సేవ మర్చిపోలేనిది. మీ అరెస్టుతో తల్లిదండ్రులతో పాటు నేనూ ఎంతో బాధపడ్డాను’’ అని భువనేశ్వరి అన్నారు. సెప్టెంబర్ 5న భీమవరం నియోజకవర్గం గునుపూడిలో యువగళం పాదయాత్రపై వైసీపీ మూకలు రాళ్లదాడికి పాల్పడ్డాయి.

దీనిలో యువగళం వాలంటీర్లకే గాయాలయ్యాయి. వైసీపీ అల్లరిమూకలను అదుపు చేయని పోలీసులు బాధితులైన వాలంటీర్లపైనే 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాలంటీర్లను సెప్టెంబర్ 6న భీమవరంలో కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో సుమారు నెల రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండులో ఉన్న వాలంటీర్లు శనివారం బెయిల్ పై విడుదల అయ్యారు.

Also Read:

TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త

రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..?

#nara-bhuvaneshwari #andhra-pradesh-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe