Nara Bhuvaneshwari: చంద్రబాబును రక్షించమని అమ్మవారిని కోరుకున్నా: భువనేశ్వరి ఒక బిడ్డగా మనసు బాగలేకపోతే తల్లిదండ్రులకు వెళ్తారని.. అందుకే తాను అమ్మవారిని దర్శించుకున్నానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. మా ఆయన చంద్రబాబును రక్షించమని ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని తాను కోరుకున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన సోదరుడు నందమూరి రామకృష్ణతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. By BalaMurali Krishna 09 Sep 2023 in విజయవాడ రాజకీయాలు New Update షేర్ చేయండి ఒక బిడ్డగా మనసు బాగలేకపోతే తల్లిదండ్రులకు వెళ్తారని.. అందుకే తాను అమ్మవారిని దర్శించుకున్నానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. మా ఆయన చంద్రబాబును రక్షించమని ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని తాను కోరుకున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన సోదరుడు నందమూరి రామకృష్ణతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదని.. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసమన్నారు. మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు బావ, బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. 2021లో ఉన్న కేసును తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని వాపోయారు. విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తొలి స్థానంలో ఉన్న ఏపీని జగన్ ప్రభుత్వం అడుక్కునే స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని వదిలేసి ముఖ్యమంత్రి జగన్ విదేశాలు తిరుగుతున్నారని ఇలాంటి సీఎం ఉండటం మన దౌర్భాగ్యమని విమర్శించారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి. కె రాఘవేంద్ర రావు — Raghavendra Rao K (@Ragavendraraoba) September 9, 2023 మరోవైపు దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. షఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి." ఆయన ట్వీట్ చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి