/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-91.jpg)
Nani's Second Look From Saripodhaa Sanivaram : న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ ముద్దు గుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అంటే సుందరానికి ‘ లాంటి సూపర్ హిట్ తర్వాత వివేక్, నాని కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. రీసెంట్ గా మ్యూజికల్ గా ప్రమోషన్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది. నాని ఇందులో సూర్య అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన రెండో లుక్‌ను గురువారం విడుదల చేశారు. శనివారాల్లో యాక్షన్ కోణంలో హింసాత్మకంగా కనిపించే సూర్య.. మిగిలిన రోజుల్లో ఎలా ఉంటాడన్నది ఈ ప్రచార చిత్రంతో చూపించారు. నాని ఆ పోస్టర్‌లో పక్కింటి కుర్రాడి తరహాలో బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ రావడం కనిపించింది.
Every raging Saturday has its calm counterpart 😎
Now, Experience a new dimension of Surya on other days ❤️#SaripodhaaSanivaaram #SuryasSaturday
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari… pic.twitter.com/UngM0bMWum
— DVV Entertainment (@DVVMovies) July 4, 2024
Also Read : ‘హోప్ ఆఫ్ శంభాల’ .. యూట్యూబ్ లో కల్కి సాంగ్ ట్రెండ్..!
ఒక్క పోస్టర్ తో కన్ఫ్యూజన్...
‘‘వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్ చిత్రమిది. దీంట్లో నాని పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాని క్లాస్ లుక్ తో కనిపించడం ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసింది. దీంతో నాని ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడా? లేక ఒక్కడే రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.