Saripodhaa Sanivaram OTT : రెండు ఓటీటీల్లో 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ అప్పుడే?

'సరిపోదా శనివారం' మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తాజా సమాచారం. ఈ మూవీ సౌత్‌ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకోగా.. హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకుంది. కాగా రిలీజైన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్ నడుస్తోంది.

New Update
Saripodhaa Sanivaram OTT : రెండు ఓటీటీల్లో 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ అప్పుడే?

Saripodhaa Sanivaram OTT :  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయికగా నటించగా.. ఎస్.జే సూర్య విలన్ గా ప్రధాన పాత్రలో నటించారు.

భారీ హైప్ తో నేడు (ఆగస్టు 29) థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న నానికి 'సరిపోదా శనివారం' తో హ్యాట్రిక్ కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : హేమా కమిటీ ఎఫెక్ట్, కోలీవుడ్ లోనూ కమిటీ ఏర్పాటు.. వెల్లడించిన హీరో విశాల్

ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తాజా సమాచారం. 'సరిపోదా శనివారం' మూవీ సౌత్‌ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకుంది.కాగా మూవీ రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీకి రానుందని టాక్ నడుస్తోంది. సెప్టెంబర్‌ 26 నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు