/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nn-1-jpg.webp)
Natural star Nani: నేచురల్ స్టార్ హీరో నాని(Natural star Nani) నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’(Hai Nanna). తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ‘హాయ్ నాన్న’ టీజర్ అక్టోబర్ 15న ఉదయం 11 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అయితే, ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ తోపాటు రిలీజ్ అయిన సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘హాయ్ నాన్న’ టీజర్ బాగుంటుందని నాని మరింత ఆసక్తి పెంచేశారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేయబోతుందన్నారు.
తండ్రి, కూతురు సెంటిమెంట్ తో రాబోతున్న ఈ చిత్రానికి శౌర్యూవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా నాని కూతురిగా అలరించబోతోంది. క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయిక. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నండటం విశేషం. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇంకా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. నేచురల్ స్టార్ నాని (Nani) చివరిగా ‘దసరా’తో రచ్చ రచ్చ చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. దీంతో నెక్ట్స్ రాబోతున్న చిత్రం Hai Nannaపైనా అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొదటి నుంచి ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్ స్పందించలేదు..!!