Ramakrishna: చంద్రబాబుకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు: రామకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై నారా భువనేశ్వరి సోదరుడు ఆయన బావ నందమూరి రామకృష్ణ మరోసారి ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు అరెస్టును అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా అరెస్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు విపరీతంగా నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. By BalaMurali Krishna 17 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Ramakrishna: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై నారా భువనేశ్వరి సోదరుడు ఆయన బావ నందమూరి రామకృష్ణ మరోసారి ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు అరెస్టును అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా అరెస్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు విపరీతంగా నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది సంఘీభావం తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశవిదేశాల నుంచి సైతం చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. తాము సైతం సీబీఎన్‌తోనే అంటూ ముందుకు వచ్చి వారి వారి సంఘీభావాలు తెలియజేయడం సంతోషకరమన్నారు. యావత్ ప్రజానీకం ఇలా తమ సంఘీభావాన్ని తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతానని వెల్లడించారు. అలాగే చంద్రబాబు అరెస్టు వార్త విని చాలామంది షాక్‌తో గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోయారని.. వారి గురించి ఆలోచిస్తుంటేనే మనసు ఎంతో బాధగా ఉందని వాపోయారు. వారందరూ ఎక్కడ ఉన్నా సరే వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మా కుటుంబాల నుంచి ఆయా కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నానని రామకృష్ణ వివరించారు. Your browser does not support the video tag. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత కేఎస్ ప్రధాని మోదీకి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయించిందా? అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు ఆయన. “మీరు జీ20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో.. అందుకు సహకరించిన మీ పార్టీపై కూడా అంతే కోపం ఉంది. కానీ 2014 ఎన్నికల్లో మీకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీటు వచ్చిందంటే అది చంద్రబాబు వల్లనే” అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మీరు మోదీ అభిమానినా? NaMo యాప్లో నేరుగా బర్త్ డే విషేస్ ఇలా చెప్పండి…!! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి