Tummala Nageswara Rao: తుమ్మల ఇంటికి నామా నాగేశ్వర రావు.. నామినేటెడ్ పదవి ఆఫర్..!!

అధికార పక్షం విడుదల చేసిన అభ్యర్థు మొదటి జాబితాలో పేర్లు లేని సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. ఈక్రమంలోనే పాలేరు నుంచి  టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కూల్ చేసే పనిలో పార్టీ పడింది. దీంతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికెళ్లారు.

New Update
Tummala Nageswara Rao: తుమ్మల ఇంటికి నామా నాగేశ్వర రావు.. నామినేటెడ్ పదవి ఆఫర్..!!

Tummala Nageswara Rao: అధికార పక్షం విడుదల చేసిన అభ్యర్థు మొదటి జాబితాలో పేర్లు లేని సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. ఈక్రమంలోనే పాలేరు నుంచి  టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కూల్ చేసే పనిలో పార్టీ పడింది. దీంతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికెళ్లారు.

అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే నామా తుమ్మల ఇంటికెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ భేటీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా పాల్గొన్నారు. అయితే తుమ్మల నాగేశ్వర రావుకు నామినేటెడ్ పదవుల హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ విషయంలో ఆయన నిర్ణయం ఏవిధంగా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. కాగా, పాలేరు నుంచి బరిలోకి దిగాలని తుమ్మల ప్లాన్ చేసుకున్నారు. కాని ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర నిరాశకు లోనయ్యారు.

పాలేరు నుంచే బరిలోకి దిగాలని..!

తుమ్మలకు బీఆర్ఎస్ పాలేరు నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆయన వర్గీయులు సమావేశమైన ఆయన్ని పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి రావాలని ఆయన వర్గీయులు ఆయన్ని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కాగా, 2014 ఎన్నికల తరువాత ఆయన కేసీఆర్ పిలిస్తే టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీలోకి చేరిన కొన్ని రోజులకే కేసీఆర్ ఆయన్ని కేబినెట్ లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి ఆయనకు టికెట్ ఇవ్వగా.. ఆయన ఓడిపోయారు. అయితే ఈ సారి కూడా పాలేరు నుంచి టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. కాని ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నుంచి తుమ్మలకు ఆఫర్లు..!

పాలేరు నుంచి టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్న సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావుకు ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఇంకా బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ నామా నాగేశ్వర రావు ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఇచ్చిన నామినేటెడ్ పోస్ట్ తో తుమ్మల సరిపెట్టుకుంటారా.. లేక కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న ఆఫర్లతో పాలేరు నుంచి బరిలోకి దిగుతారా అన్నది వేచి చూడాలి. అయితే ప్రస్తుతం తుమ్మల నాగేశ్వర రావు పంటి సమస్యతో హైదరాబాద్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తరువాత ఆయన తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు