Indrasena Reddy: నేను గవర్నర్ కావడం తెలంగాణ బీజేపీకి బూస్ట్: ఇంద్రసేనారెడ్డి

తెలంగాణలో బీజేపీకి తన నియామకం కొత్త బూస్ట్ అని త్రిపురా గవర్నర్ గా నియామకమైన ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఎన్నికలకోడ్ కు తన నియామకానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

New Update
Indrasena Reddy: నేను గవర్నర్ కావడం తెలంగాణ బీజేపీకి బూస్ట్: ఇంద్రసేనారెడ్డి

బీజేపీ లో (BJP) కష్టపడినవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని మరోసారి నిరూపితమైందని త్రిపురా గవర్నర్ గా నియమితులైన ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) అన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తనను గవర్నర్ గా నియమించినందుకు కాంగ్రెస్ కి కడుపుమంట అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. గవర్నర్లు వ్యవస్థ వద్దు అంటున్న కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిద్రపోయాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి తన నియామకం కొత్త బూస్ట్ అని అన్నారు. ఎన్నికలకోడ్ కు తన నియామకానికి సంబంధం లేదన్నారు. ఎన్నికలు తెలంగాణలో ఉన్నాయని.. తన నియామకం త్రిపురలో జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?

త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రాసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ గా రఘుబర్ దాస్ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. నల్లు ఇంద్రాసేనారెడ్డి తెలంగాణకు చెందిన బీజేపీ అగ్రనేత. రఘుబస్ దాస్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి.  నల్లు ఇంద్రాసేనా రెడ్డి ఉమ్మడి ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆయన స్వస్థలం సూర్యపేట జిల్లా. ఇంద్రసేనారెడ్డి 1983, 1985, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి 2009లో మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి, 2014లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: సింగరేణి విషయంలో అది నిజం కాదా? సీఎం కేసీఆర్‌పై రేవంత్ సంచలన కామెంట్స్..

విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల మక్కువను పెంచుకున్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా నగర కార్యదర్శిగా ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా జైలుకు వెళ్లారు. జనతా పార్టీ రాష్ట్ర శాఖ యువ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, బిజెపి ఏర్పడిన తర్వాత యువమోర్చా తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా, యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నల్లు ఇంద్రాసేనారెడ్డి పనిచేశారు. బిజెపి రాష్ట్ర కోశాధికారిగా, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులుగా పని చేస్తున్నారు.1999 నుండి 2003 వరకు బిజెపి శాసనసభ పక్ష నాయకులుగా పనిచేశారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు