నల్లగొండ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి మొదలైంది. పార్టీని బలోపేతం చేయడం, రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహించాలని హస్తం పార్టీ హైకమాండ్ నేతలకు చెబుతోంది. అయితే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాత్రం చేరికలను వ్యతిరేకిస్తున్నారు. BRSకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, 13 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరడంపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తమను సంప్రదించకుండానే ఎలా చేర్చుకుంటారని అధిష్టానంపై నేతలు ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో మున్షి సమక్షంలో చేరికలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన హైకమాండ్ చివరకు చేరికలు చెల్లవని ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషయం ఉమ్మడి జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Nalgonda Politics: నల్లగొండ కాంగ్రెస్ లో కొత్త లొల్లి.. ఆ చేరికలు చెల్లవన్న పీసీసీ!
ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ పాలిటిక్స్ లో కొత్త వివాదం చెలరేగింది. పార్టీలో చేరికలను ఏకంగా ఎమ్మెల్యేనే వ్యతిరేకించడం సంచలనంగా మారింది. దీంతో దిగొచ్చిన పీసీసీ ఆ చేరికలు చెల్లవని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చూడండి.
New Update
Advertisment