/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Komatireddy-Venkat-Reddy-1.jpg)
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరుల కోసం నల్లగొండ రింగ్ రోడ్ ఏర్పాటులో అవకతవకలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. రింగ్ రోడ్ కోసం రూపొందించిన ప్లాన్ 1, 2 వదిలేసి తన అనుచరుల లబ్ధికోసం కోమటిరెడ్డి ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు. తక్షణం ప్లాన్ 3 ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామన్నారు. ప్లాన్-3 ఉప సంహరణ కోసం ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నామన్నారు.
ఈలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే బాధితులతో కలిసి పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. అనంతరం ఉత్తర్వులు రద్దు చేసేవరకు దశల వారీగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వం తోనూ ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని భూపాల్ రెడ్డి తెలిపారు.
ఉప సమహరించుకోకుంటే... ఉద్యమిస్తాం.... కంచర్ల భూపాల్ రెడ్డి
కలక్టర్ కు వినతి పత్రం సమర్పించిన.. బాధితులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో... నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలవారు.. పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం లో... కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు.. pic.twitter.com/08FEYNSic4— Kancharla Bhupal Reddy (@BhupalReddyTRS) June 21, 2024
తమ అనుచరులకు దోచి పెట్టడానికి మంత్రి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. 3000 కుటుంబాలు తాము కష్టపడి చమటోడ్చి... సంపాదించుకున్న ప్లాట్లు, ఇండ్లు నష్ట పోతున్నా పట్టించుకోకుండా అధికారం ఉందనే అహంకారం తో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. బాధితుల గోడు పట్టించుకోవట్లేదన్నారు.