JOBS: NALCO 277 ఉద్యోగాలు.. భారీ వేతనాలు!

బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ( NALCO) 277 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 04 నుంచి ఏప్రిల్ 02 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.

New Update
JOBS: NALCO 277 ఉద్యోగాలు.. భారీ వేతనాలు!

NALCO : బీటెక్(B.Tech) పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(NALCO) తీపి కబురు అందించింది. తమ కంపెనీలో వివిధ శాఖల్లో ఖాళీగావున్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెబుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంతేకాదు ట్రైనింగ్ పీరియడ్ లోనే భారీ వేతనాలు అందించనున్నట్లు తెలిపింది.

ట్రైయినీ పోస్టుల భ‌ర్తీకి..
ఈ మేరకు ఒడిశా(Odisha) రాష్ట్రం భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ పోస్టు(Graduate Engineering Trainee Post) ల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్ త‌దిత‌ర విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుండగా ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 65% మార్కులతో బీఈ, బీటెక్‌, ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 అర్హ‌త సాధించి ఉండాలని పేర్కొంది. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ మార్చి 04 నుంచి ఏప్రిల్ 02 వ‌ర‌కు కొనసాగనుండగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి :Hyderabad : నేడే ఘట్​కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం!

మొత్తం ఖాళీలు : 277

పోస్టులు:
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ

విభాగాలు :
మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్

వ‌య‌స్సు :
అభ్యర్థులు 30 ఏండ్లకు మించరాదు.

అర్హతలు:
బీఈ, బీటెక్‌, ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 అర్హ‌త సాధించి ఉండాలి.

వేతనం :
రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకూ అందించనున్నారు.

దరఖాస్తు:
ఆన్‌లైన్‌లో విధానంలో మార్చి 04 ఏప్రిల్ 2 వరకూ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కొనసాగనుంది.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్ ను సంప్రదించండి :https://nalcoindia.com/

Advertisment
తాజా కథనాలు