వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు విచ్చిన్నమయ్యాయి.!
వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు విచ్చిన్నమయ్యాయని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఈ క్రమంలోనే టీడీపీ జనసేన నేతలకు పలు సూచనలు చేశారు. బూత్ ల వారీగా ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
TDP-JSP: బాపట్ల జిల్లా వేమూరులో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు(Nakka Anand babu) జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతూ..వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు విచ్చిన్నమయ్యాయని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే టీడీపీ జనసేన నేతలకు పలు సూచనలు చేశారు. బూత్ ల వారీగా ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రానికి పట్టిన శని జగన్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ చరిత్రలో ఏనాడూ రాని కరువు వచ్చిందని కామెంట్స్ చేశారు. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన కరువు వచ్చిందని అన్నారు. అయితే, జగన్ మాత్రం కరువు లేదు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారని ఫైర్ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందేవరకూ పోరాడతామని అన్నారు.
కాగా, టీడీపీ-జనసేన సంయుక్త ఆధ్వర్యంలో 18,19 తేదీలలో రోడ్లపై ఆందోళన చేయనున్నారు. వైసీపీ పాలనలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ-జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెండు పార్టీలు పిలుపునిచ్చాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెడీ అవుతు ప్రణాళికలు వేస్తున్నారు టీడీపీ జనసైనికులు.

Also Read: ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!
రాష్ట్రానికి పట్టిన శని జగన్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ చరిత్రలో ఏనాడూ రాని కరువు వచ్చిందని కామెంట్స్ చేశారు. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన కరువు వచ్చిందని అన్నారు. అయితే, జగన్ మాత్రం కరువు లేదు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారని ఫైర్ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందేవరకూ పోరాడతామని అన్నారు.
Also Read: మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. ప్రేమ జంట సంచలన వ్యాఖ్యలు.!