Nail growth: నిమ్మకాయలో ఎన్నో ఔషద గుణాలతోపాటు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో నిమ్మకాయ నీరు తాగటం వల్ల ఎండ వేడి నుంచి ఉపశమనంతోపాటు శరీరానికి రక్షణ లభిస్తుంది. అయితే.. నిమ్మకాయను ఉపయోగించడం ద్వారా కూడా గోళ్లను పొడవుగా, అందంగా మార్చుకోవచ్చని చాలామందికి తెలియదు. కొందరూ గోళ్ల పెరుగుదల కోసం మార్కెట్‌లో లభించే అనేక రకాల వస్తువులను వాడుతాడు. అయితే గోళ్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి కొందరూ అమ్మాయిలు వారి గోళ్లను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా వారికి ఉపశమనం లభించడం లేదు. అటువంటి పరిస్థితిలో.. మీరు నిమ్మకాయను ఉపయోగించడం ద్వారా మీ గోళ్లను పెద్దదిగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోళ్లకు నిమ్మకాయను ఎలా వాడాలి..? దానివల్ల గోళ్ల ఎలా పెరుగుతాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నిమ్మకాయంతో గోళ్ల అందంగా, పొడవుగా పెరిగే చిట్కాలు:
- అమ్మాయిలు తమ గోళ్లను పెంచుకోవాలని కోరుకుంటారు. కానీ అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా గోర్లు పొడవుగా పెరగవు.
- నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గోళ్లకు చాలా ప్రయోజనకరంగా పని చేస్తాయి.
- ముందుగా చెంచా నిమ్మరసంలో ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ గోళ్లపై 10 నిమిషాల పాటు రాయాలి.. ఆరిన తర్వాత కడగాలి.
- నిమ్మరసంలో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని గోళ్లపై 10 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత కడిగేయాలి.
- గోళ్లపై నిమ్మరసం రాసుకున్న తర్వాత కచ్చితంగా సన్‌స్క్రీన్‌ను వాడాలని గుర్తు్ంచుకోవాలి.
- మీ గోళ్ళపై ఏవైనా గాయాలు ఉంటే.. నిమ్మకాయను ఉపయోగించకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఎక్కువసేపు ఆకలితో అలానే ఉంటున్నారా? కాలేయం-కిడ్నీ దెబ్బతినే ప్రమాదం!