/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-07T133439.271-jpg.webp)
Actress Shobha Shetty : బుల్లి తెర ప్రేక్షకులకు శోభ శెట్టి(Shobha Shetty) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీరియల్స్, టీవీ షోస్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కార్తీక దీపం సీరియల్(Karthika Deepam Serial) లో ఈ బ్యూటీ విలన్ మౌనిత పాత్రలో నటించింది. ఈ సీరియల్ ఎంత ఫేమస్ అయ్యిందో.. సీరియల్ లో క్యారెక్టర్స్ కూడా అంతే పాపులర్ అయ్యాయి. అందులో ఒకటి శోభ శెట్టి నటించిన మౌనిత పాత్ర. కార్తీక దీపం సీరియల్ తరువాత శోభ శెట్టి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకుంది.
నాగార్జునకు థ్యాంక్స్ చెప్పిన శోభ
ఈ పాపులారిటీ తో బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7) లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో కూడా తన స్టైల్ లో గేమ్ ఆడుతూ.. లేడీ పటాకా అనిపించుకుంది. తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శోభ 13 వారల పాటు బిగ్ బాస్ ఇంట్లో కొనసాగింది. ఇక తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శోభ.. వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున(Nagarjuna) ధరించిన టీ షర్ట్ వేసుకుంది. ఈ టీ షర్ట్ నాగార్జున శోభకు గిఫ్ట్ గా పంపించారు. ఈ విషయాన్నీ శోభ తన ఇంస్టాగ్రామ్ వేదిక షేర్ చేసుకుంది. "గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ నాగ సార్" అంటూ కృతజ్ఞతలు తెలిపింది. అసలు విషయమేంటంటే..
Also Read: Deepthi Sunaina: “నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో” బ్లూ డ్రెస్ లో సునైన భలే ఉందిగా 🥰
శోభకు నాగార్జున గిఫ్ట్
వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున కాస్ట్యూమ్స్ చాలా స్పెషల్ గా కనిపిస్తాయి. వీటిని చాలా మంది కూడా బాగా ఇష్టపడతారు. అయితే షోలో ఒకసారి నాగార్జున ధరించిన టీ షర్ట్ చూసి ముచ్చటపడింది శోభ. టీ బాగా నచ్చడంతో తనకు కావాలని నాగార్జునను అడిగింది. ఆ తరువాత దాని గురించి మళ్ళీ అడగలేదు. ఈ విషయం గుర్తు పెట్టుకున్న నాగార్జున తాజాగా తన మేనేజర్ తో.. శోభ కోసం ఆ షర్ట్ గిఫ్ట్ గా పంపించారు. గిఫ్ట్ అందుకున్న శోభ సంతోషంతో ఈ విషయాన్నీ సోషల్ మీడియా(Social Media) వేదికగా షేర్ చేసుకుంది. ఈ టీ షర్ట్(T-Shirt) లో ఫోటోషూట్, వీడియోలు చేసి తన ఇంస్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
View this post on Instagram