మెగామేత రూ. 48వేల కోట్లు : కాళేశ్వరంలో అడుగడుగునా అవినీతి, నాగం జనార్దనరెడ్డి సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ సీనియర్ నేత నాగంజనార్దనరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వతంత్రభారతదేశంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు. మేఘా కృష్ణారెడ్డి తో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బాధ్యులని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతికి సాక్ష్యంగా కాగ్ నివేదికను ఆయన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.

New Update
మెగామేత రూ. 48వేల కోట్లు : కాళేశ్వరంలో అడుగడుగునా అవినీతి, నాగం జనార్దనరెడ్డి సంచలన ఆరోపణలు

కాళేశ్వరంలో అడుగడుగునా అవినీతి చోటుచేసుకుందని నాగంజనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో 48 వేల కోట్లు అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఈ డబ్బుతోనే మేఘా కృష్ణారెడ్డి మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని విమర్శించారు.
''కృష్ణారెడ్డిని విడిచిపెట్టను. ఏసీబీకి ఫిర్యాదుచేస్తా. ఏసీబీ కోర్టులో  కాగ్ నివేదికను  ప్రవేశపెడతా" అన్నారు. 2004లో సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న కృష్ణారెడ్డి  ఈ స్థాయికి ఎలా ఎదిగాడని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ లే కారణం

కాళేశ్వరంలో అవినీతికి సీఎం కేసీఆర్ తో పాటు, మంత్రులు కేటీఆర్, హరీష్ లే కారణమని ఆయన ఆరోపించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. క్యాన్సర్ కంటే కేసీఆర్ ప్రమాదకరంగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ అడ్వైజర్లు రేట్లు ఎట్లా ఫిక్స్ చేస్తారని ప్రశ్నించారు. కొందరు నేతలు డబ్బులు తీసుకుని అవినీతిపై ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ నేతలూ.. నిలదీయండి

కర్ణాటక 40 శాతం అవినీతి జరిగితే తెలంగాణ 70 శాతం జరిగిందని నాగం జనార్దనరెడ్డి కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ఎంపీలంతా దీనిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ఒక చీడపురుగు అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ తోనే ఉంటా

తాను కాంగ్రెస్ తోనే ఉంటానని నాగం  వ్యాఖ్యానించారు. '' ఎవరూ లేనప్పుడు ఐదేళ్ళుగా నాగర్‌కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నాను. జూపల్లి, దామోదర్ రెడ్డిలు ఇప్పుడొచ్చి టికెట్ నాదేనంటున్నారు. దామోదర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా చేరలేదు.ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్ లోకి వెళ్ళరని గ్యారంటీ ఏంటీ? అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో తాను సీనియర్ నని, కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ని కాదని చెప్పారు. అందరూ టికెట్ కోసం దరఖాస్తు చేస్తే తానూ చేశానని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు