Nadendla Manohar: మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం.!

రాష్ట్ర మంత్రిగా జ‌న‌సేన నేత నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా సేవలందించారు. ఆ తరువాత జనసేనలో చేరి పవన్ కు కుడి భుజంగా మారారు.

New Update
Nadendla Manohar: మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం.!

Nadendla Manohar: రాష్ట్ర మంత్రిగా జ‌న‌సేన నేత నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 2004, 2009 వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2011 - 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా సేవలందించారు.

Also Read: మంత్రిగా కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం

ఆ తరువాత కొనాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల ఎవరూ ఊహించని విధంగా అక్టోబర్ 2018లో జనసేనలో చేరారు. పవన్ కు కుడి భుజంగా మారారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నాదెండ్ల 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు.

Advertisment
తాజా కథనాలు