/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-13.jpg)
N Amarnath Reddy: వైసీపీ నేత బొత్సకు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆవేశపడకు బొత్సా.. అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ ప్రయోజనాల కోసమే పని చేస్తారని.. సీనియర్ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసమే పని చేస్తారన్నారు. మీ లాగా కేసుల కోసం, ఆస్తులు కాపాడుకోవలసిన పని ఆయనకు లేదన్నారు.
Also read: ఇలాంటి సంప్రదాయం ఆపండి.. చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక..!
'మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదు .. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తాం అని చెప్పిన మాటలు మర్చిపోలేదు.. బందర్ పోర్టులో వాటా ఇస్తాం అని చెప్పిన విషయం మర్చిపోలేదు.. తాళాలు పగలగొట్టి ఎపీ ఆయుష్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటే నోరు మూసుకున్న విషయం మర్చిపోలేదు.. పోలవరం నీళ్ళు కేసీఆర్ తీసుకుని వెళ్తాం అని చెప్పిన మాట మర్చిపోలేదు.. పోలవరం ఎత్తు తగ్గించమని జగన్ కి చెప్పానని కేసీఆర్ చెప్పింది మర్చిపోలేదు.. కేసీఆర్ కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడిన విషయం మర్చిపోలేదు' అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.
ఆవేశపడకు బొత్సా..
అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు గారు..
మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపి భవన్ ఇచ్చేస్తాం అని చెప్పిన మాటలు మర్చిపోలేదు.. బందర్ పోర్టులో వాటా ఇస్తాం అని చెప్పిన విషయం మర్చిపోలేదు..తాళాలు పగలగొట్టి 1/3 pic.twitter.com/gFoYugNCeB
— N Amarnath Reddy (@NAmaranathReddy) July 6, 2024