Vizag Beach: విశాఖ తీరానికి పురాతన పెట్టె ..అది ఎప్పటిది అంటే! విశాఖపట్నం (Vizag) లోని వైఎంసీఏ తీరానికి ఓ భారీ చెక్కె పెట్టె కొట్టుకు (Wooden Box) వచ్చింది. శుక్రవారం రాత్రి సమయంలో మత్య్సకారులు ఈ పెట్టెను గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బీచ్ కు చేరుకుని పురాతన చెక్క పెట్టెను ప్రొక్లెనయిర్ సాయంతో ఒడ్డుకు తీసుకుని వచ్చారు. పెట్టె చాలా భారీగా ఉంది. By Bhavana 30 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో సముద్ర తీరాలకు భారీ పెట్టెలు, బోషాణాలు కొట్టుకురావడం పరిపాటిగా మారింది. కొద్ది రోజుల క్రితం కూడా ఇనుప పెట్టె ఒకటి కొట్టుకుని రాగా..దానిలో నిధినిక్షేపాలు ఉంటాయోమోనని జనం తెగ ఎగబడి చూశారు. తీరా చూస్తే అందులో పాతవి నాలుగు దస్తావేజుల కాగితాలు ఉన్నాయి. తాజాగా విశాఖపట్నం (Vizag) లోని వైఎంసీఏ తీరానికి ఓ భారీ చెక్కె పెట్టె కొట్టుకు (Wooden Box) వచ్చింది. శుక్రవారం రాత్రి సమయంలో మత్య్సకారులు ఈ పెట్టెను గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బీచ్ కు చేరుకుని పురాతన చెక్క పెట్టెను ప్రొక్లెనయిర్ సాయంతో ఒడ్డుకు తీసుకుని వచ్చారు. పెట్టె చాలా భారీగా ఉంది. చూడటానికి ఇది బ్రిటీష్ కాలం నాటిదిలాగా అనిపిస్తుంది. సుమారు వంద టన్నుల బరువు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం గురించి పోలీసులు ఆర్కియాలజీ విభాగానికి సమాచారం అందించారు. బీచ్ లోకి భారీ పెట్టె కొట్టుకు వచ్చిందని తెలియడంతో సందర్శకులు ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆ పెట్టెలో ఏముంది అనేది తెలియాల్సి ఉంది. అందరిలోనూ ఆ పెట్టెలో ఏముంది అనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే విశాఖలోని ఆర్కే బీచ్ లో బ్రిటీష్ కాలం నాటి బంకర్లు బయటపడిన విషయం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువుల పై దాడి కోసం ఈ బంకర్లును వాడినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి బంకర్లు విశాఖ సముద్ర తీరంలో చాలా ఉన్నాయి. కాల క్రమంలో అవి కొన్ని ఇసుకలో కూరుకునిపోయాయి. ప్రస్తుతం కొట్టుకుని వచ్చిన పెట్టె రాతి యుగం నాటిదా అనేది తెలియాల్సి ఉంది.ఇంత భారీ పెట్టె సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం మిస్టరీగా మారింది. #vizag #ymca-beach #wooden-box మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి