/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-100-2.jpg)
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి దశకు చేరింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయాన్ని సాధించింది. సీఎస్‌కే పై గెలుపుతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. దీంతో బెంగళూరు ఆటగాళ్లతో పాటు ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రికెట్ మ్యాచుల్లో ఆట మాత్రమే కాదు కొన్ని సార్లు అభిమానులు చేసే పనులు కూడా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్టార్లుగా మారిన ఘటనలు చూశాం. తాజాగా ఓ అమ్మాయి పై ప్రస్తుతం అందరి దృష్టి పడింది. చెన్నై ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు పూర్తి అయిన తరువాత 15వ ఓవర్ ప్రారంభానికి ముందు కెమెరామెన్ గ్యాలరీలపై ఫోకస్ చేశాడు.
RCB vs CSK के मैच में 'मिस्ट्री गर्ल' ने लगाए ऐसे ठुमके, जमकर Viral हुआ Video#IPL2024 pic.twitter.com/DT8Rqb95pi
— Vishal Kumar (@VishalSports123) May 20, 2024