Mynampally: కేసీఆర్‌, రేవంత్‌పై బూతులతో విరుచుకుపడిన మైనంపల్లి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అయితే ఏకంగా సీఎం కేసీఆర్‌తో పాటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిలపై బూతులతో రెచ్చిపోయారు. ఫోన్‌లో కార్యకర్తలతో సంభాషణ సందర్భంగా వారిద్దరిని బండ బూతులు తిడుతున్న ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

New Update
Mynampally: కేసీఆర్‌, రేవంత్‌పై బూతులతో విరుచుకుపడిన మైనంపల్లి

బూతులతో రెచ్చిపోయిన మైనంపల్లి..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన దగ్గరి నుంచి పాలిటిక్స్ మరింత వేడిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అయితే ఏకంగా సీఎం కేసీఆర్‌తో పాటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై బూతులతో రెచ్చిపోయారు. ఫోన్‌లో కార్యకర్తలతో సంభాషణ సందర్భంగా వారిద్దరిని బండ బూతులు తిడుతున్న ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సిద్ధిపేటలో నిన్ను ఓడిస్తా హరీష్..

ఇటీవల మంత్రి హరీష్‌రావుపై మైనంపల్లి  చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.  తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతం మైనంపల్లి సన్నిహితులతో మాట్లాడుతూ హరీష్ రావును గద్దె దించే వరకు నిద్రపోనని తెలిపారు. మల్కాజిగిరిలో తాను, మెదక్‌లో తన కుమారుడు ఇద్దరం పోటీ చేస్తామని స్పష్టంచేశారు. మెదక్‌లో హరీష్ పెత్తనం ఏంది? అని ప్రశ్నించారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి హరీష్‌రావే కారణమన్నారు. మెదక్‌లో హరీష్‌ వేలు పెడితే తాను సిద్దిపేటలో పెడతానని తెలిపారు.

రబ్బరు చెప్పులు, ట్రంక్ పెట్టె పట్టుకుని వెలమ హాస్టల్ కి వచ్చిన హరీష్‌రావు.. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో గమనించాలని.. అక్రమంగా రూ.లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపించారు. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశారన్నారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని.. తనకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించిందన్నారు. అయితే తన కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని మైనంపల్లి స్పష్టం చేశారు. లేదంటే ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల ముందు మైనంపల్లి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.

కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం.. 

మైనంపల్లి వ్యాఖ్యలపై హరీష్ మద్దతుదారులతో పాటు బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వయంగా కేటీఆర్ హరీష్‌కు మద్దతు ఇస్తూ ట్వీట్ కూడా చేశారు. అయితే ఈ వివాదంపై హరీష్‌రావు ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. కేసీఆర్ కూడా పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరూ పనిచేసినా సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారు.

Advertisment
తాజా కథనాలు