Mynampalli Hanmanth Rao: ఆ 3 సీట్లలో బీఆర్ఎస్ ను ఓడిస్తా.. మైనంపల్లి సంచలన సవాల్

మల్కాజ్ గిరి, మెదక్, మేడ్చల్ తో పాటు మరో పది పదిహేను నియోజకవర్గాలపై తాను దృష్టి పెడుతున్నానని.. వీటన్నింటిలో బీఆర్ఎస్ ను ఓడిస్తానని మైనంపల్లి హన్మంతరావు సవాల్ చేశారు. కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ మంత్రుల పని దోచుకోవడమే తప్ప వేరేమీ లేదన్నారు. 2 ఎకరాలు కొనడం 10 ఎకరాలు కబ్జా చేయడమే వారికి తెలుసన్నారు. మల్లారెడ్డి కాలేజీలన్నీ కబ్జా చేసిన చెరువుల్లోనే ఉన్నాయని మండిపడ్డారు.

Mynampalli Hanmanth Rao: ఆ 3 సీట్లలో బీఆర్ఎస్ ను ఓడిస్తా.. మైనంపల్లి సంచలన సవాల్
New Update

మల్కాజ్ గిరి, మెదక్, మేడ్చల్ సీట్లతో పాటు మరో పది సీట్లపై తాను దృష్టి సారించానని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీట్లలో బీఆర్ఎస్ ను ఓడించి తీరతానని తెలిపారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. 'వాడొక బఫూన్ మంత్రి.. కామన్ సెన్స్ లేదు' అని మంత్రి మల్లారెడ్డిపై తిట్ల దండకం మొదలెట్టారు. మల్కాజ్ గిరిలో తాను ఏం చేశానో ప్రజలకు తెలుసునన్నారు. మల్కాజ్ గిరి ప్రజలను బీఆర్ఎస్ నాయకులు తక్కువ అంచనా వేస్తున్నారని, వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు. గత ఎన్నికల్లో నేను 74వేల మెజారిటీతో గెలిచానని, అనంతరం నాలుగు నెలలకే జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8000 మైనస్ ఓటింగ్ వచ్చిందన్నారు. 82వేల మైనస్ అంటే ఇక్కడి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో అర్థం చేసుకోవాలన్నారు.

బీఆర్ఎస్ మంత్రుల పని దోచుకోవడమే తప్ప వేరేమీ లేదన్నారు. 2 ఎకరాలు కొనడం 10 ఎకరాలు కబ్జా చేయడమే వారికి తెలుసన్నారు. మల్లారెడ్డి కాలేజీలన్నీ కబ్జా చేసిన చెరువుల్లోనే ఉన్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలుచేయలేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల మంది ఇళ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటే.. 500 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. 30 శాతం కమిషన్ ఇస్తేనే ఎవ్వరికైనా కాంట్రాక్టులు ఇస్తారని, ప్రస్తుతం చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రులు ఇప్పుడొచ్చి ఇక్కడ మాయమాటలు చెప్తే నడుస్తదా..? అన్నారు.

ఒక మంత్రేమో మల్కాజ్ గిరి ఇన్ చార్జట.. ఒకడేమో మెదక్ ఇన్ చార్జట... వీళ్ల అబ్బ జాగీరా ఇదేమైనా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు నియోజకవర్గాలే కాదు.. ఒక పది పదిహేను నియోజకవర్గాలపై తాను దృష్టి పెడుతున్నానని.. వీటన్నింటిలో బీఆర్ఎస్ ను ఓడిస్తానని సవాల్ చేశారు. కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయన్నారు. అప్పులు చేస్తూ పథకాల పేరిట ప్రచారం చేస్తున్న బీఆర్ ఎస్ ను ప్రజలు నమ్మరని తెలిపారు. 5 ఏళ్లలో 13 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. హైదరాబాద్ లో భూములన్నీ అమ్ముతున్నారని, ఆర్టీసీ భూములు కూడా అమ్మకానికి పెట్టారని తెలిపారు. మెదక్ జిల్లాలో విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, ఎన్ని డబ్బులు పంచినా ఉపయోగం లేదన్నారు. చివరికి నా పీఏను కూడా బీఆర్ ఎస్ వారు కొన్నారని తెలిపారు. ఎవరికి కష్టమొచ్చినా మైనంపల్లి హనుమంతరావు ఉంటాడని ప్రజలకు అభయమిచ్చారు.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe