Mynampally:వెనక్కి తగ్గేదేలే అంటున్న మైనంపల్లి.. సంచలన నిర్ణయం! త్వరలోనే కాంగ్రెస్ లోకా..!!

తనకు పార్టీ టికెట్ ఇచ్చినా తన తనయుడి టికెట్ కోసం పోరు మొదలు పెట్టిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వ్యహారం బీఆర్ఎస్ లో ముదురుతోంది. కొడుకుకు టికెట్ విషయంలో మంత్రి హరీశ్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి ఇంకా తాను అదే స్టాండ్ పై ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లే అని మరోసారి స్పష్టం చేశారు..

Mynampally:వెనక్కి తగ్గేదేలే అంటున్న మైనంపల్లి.. సంచలన నిర్ణయం! త్వరలోనే కాంగ్రెస్ లోకా..!!
New Update

Mynampally Joining Congress ?: తనకు పార్టీ టికెట్ ఇచ్చినా తన తనయుడి టికెట్ కోసం పోరు మొదలు పెట్టిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వ్యహారం బీఆర్ఎస్ (BRS) లో ముదురుతోంది. కొడుకుకు టికెట్ విషయంలో మంత్రి హరీశ్ రావు (Harish Rao) పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి ఇంకా తాను అదే స్టాండ్ పై ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లే అని మరోసారి స్పష్టం చేశారు.

ఇక ఈ రోజు తన అనుచరులు, కార్యకర్తలతో దూలపల్లిలోని ఆయన ఇంట్లో భేటీ అయ్యారు మైనంపల్లి. చాలా సేపటి వరకు సాగిన ఈ భేటీ తరువాత ఆయన బయటికొచ్చి తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. తనను పర్సనల్ గా ఎవరైనా ఇబ్బంది పెడితే తాను ఇబ్బంది పెడతానని సీరియస్ గా మైనంపల్లి వార్నింగ్ ఇచ్చారు. ప్రాణం పోయే వరకు ఉన్నది ఉన్నట్లుగానే తాను మాట్లాడుతానన్నారు. ఏ విషయంలోను వెనక్కి తగ్గే వ్యక్తిని తాను కాదన్నారు.

ఇదే సమయంలో మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు తనను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే రేపటి నుంచి వారం రోజుల పాటు తాను మల్కాజ్ గిరి నియోజకవర్గంలో తిరుగుతానన్నారు మైనంపల్లి.

మైనంపల్లికి కారు ప్రయాణం ఇక కష్టమేనా..!

ప్రస్తుతం మైనంపల్లి వర్సెస్ మంత్రి హరీశ్ రావ్ గా ఫైట్ నడుస్తున్న క్రమంలో మైనంపల్లి బీఆర్ఎస్ లో కంటిన్యూ కావడం సాధ్యపడక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు మైనంపల్లి పై అధిష్టానం వేటు తప్పకుండా వేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే మల్కాజ్ గిరి అభ్యర్థిని మార్చి మైనంపల్లికి షాక్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిలతో పాటు అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఇలా ఉంటే.. మంత్రి మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆయన తన అల్లుడిని కేసీఆర్ దగ్గరికి తీసుకొని వెళ్లారట.

మైనంపల్లికి కాంగ్రెస్ హామీ దక్కినట్టేనా..!

మరోవైపు మైనంపల్లి త్వరలోనే హ్యాండ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వనున్నట్టుగా కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. దీని కోసమే ఆయన ఈ రోజు తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ఇంట్లో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ (Congress) పెద్దలతో కూడా టచ్ ఉన్నారని..మంతనాలు నడుస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన డిమాండ్స్ ప్రకారంగా ఆయనకు మల్కాజ్ గిరి టికెట్ ఆయన తనయుడికి మెదక్ టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి సహకారంతో మల్కాజ్ గిరి సీటును ఈజీగా తమ ఖాతాలోకి వేసుకోవచ్చని కాంగ్రెస్ పెద్ద స్కెచ్ వేస్తోంది. బోనస్ గా.. మెదక్ సీట్ కూడా రావచ్చని టీపీసీసీ సీనియర్లు లెక్కలు వేస్తున్నారు. ఇక మైనంపల్లి కొందరు బీఆర్ఎస్ అసంతృప్తులను కూడా తనతో పాటు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అలా తనతో పాటు కలిసి వస్తే.. వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిపిస్తానని వారికి ఆయన భరోసా ఇస్తున్నట్టుగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మైనంపల్లి ఎపిసోడ్ కు గులాబీ బాస్ ఏవిధంగా ఎండ్ కార్డ్ వేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Also Read: బీఆర్‌ఎస్‌కే ఓటేస్తాం.. రాంపూర్‌ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం

#mynampally-hanumantha-rao #mynampally-into-congress-party #mynampally-joining-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి