కార్యకర్తల ముందు కంటతడి పెట్టిన ముత్తిరెడ్డి

కొంతకాలంగా జనగామ బీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ టికెట్ కోసం ముత్తిరెడ్డి, పల్లా వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ముత్తిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

New Update
కార్యకర్తల ముందు కంటతడి పెట్టిన ముత్తిరెడ్డి

జనగామ బీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ టికెట్ కోసం ముత్తిరెడ్డి, పల్లా వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ముత్తిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. కేసీఆర్ ఏది చెబితే అదే చేస్తానని తెలిపారు. అయితే తనకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. కొన్నిరోజులుగా తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతరవకు టిక్కెట్లను ప్రకటించలేదని కానీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ తనకే టికెట్ దక్కిందని కార్యకర్తలకు చెబుతున్నారన్నారు. పల్లా వెంట కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో పల్లా పాత్ర ఏంటని నిలదీశారు. జనగామలో పల్లా రాజేశ్వర్ కుట్రలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.

కొంతకాలంగా ముత్తిరెడ్డి, పల్లా అనుచరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునే ఉంటున్నాయి. ఈ గొడవకు సంబంధించిన ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది. జనగామ టిక్కెట్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే అని అనుచరుల ప్రచారం చేస్తుండగా.. BRS నర్మెట్ట సర్పంచ్‌ల ఫోరం ఈ ప్రచారాన్ని అడ్డుకుంది. పల్లా అనుచరుల్ని నిలదీసింది సర్పంచ్‌ల ఫోరం. ముత్తిరెడ్డికి కాకుంటే టిక్కెట్ ఎవరికిచ్చానా ఓకేనని.. పల్లా మాత్రం వద్దని తేల్చి చెబుతున్నారు నేతలు. ప్రగతి భవన్ ప్రతిష్టను పల్లా దిగజార్చుతున్నారని ఫైర్ అయ్యారు. ముత్తిరెడ్డి టికెట్ ఆశలపై నీళ్లు చల్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం జనగామ నియోజకవర్గాలన్నీ మంత్రి హరీశ్‌ రావు కనుసన్నల్లో నడుస్తున్నాయి. అక్కడి క్యాడర్ తో హరీశ్‌ రావు భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే ఏమవుతుంది అన్నదానిపై చర్చించారు. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ టికెట్ ఆశిస్తున్నారు. ఓవైపు కేసీఆర్ అండదండలు కూడా పల్లాకి ఉన్నాయి. హరీశ్‌ రావే దగ్గరుండి ఈ తతంగం అంతా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ ఇచ్చిన సూచనలతోనే ఇదంతా జరుగుతోందని టాక్. జనగామలో ప్రయోగం చేయాలంటే ముత్తిరెడ్డిని పక్కన పెట్టాల్సిందేనని బీఆర్‌ఎస్‌ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.రెండుసార్లు ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జా విషయాల్లోనూ ముత్తిరెడ్డి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకే ఈసారి తనకు టికెట్ రాదన్న విషయం ముత్తిరెడ్డికి కూడా తెలుసు. కానీ చివరి ప్రయత్నంగా కేసీఆర్‌ని కలిసి తనను నిలబెడితే కచ్చితంగా గెలుస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు