Mani Sharma: మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. "బావగారు బాగున్నారా" సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎన్నో మ్యూజికల్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మణిశర్మ మెలోడీస్ అంటే ఒక సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందనే చెప్పొచ్చు. అందుకే ఈయనను మెలోడీ బ్రహ్మ (Melody Brahma) అని అంటారు. ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు మణిశర్మ. 1998 నుంచి 2010 వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఫార్మ్ లో ఉన్న మణిశర్మ.. ఆ తర్వాత సడన్ గా ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఈ గ్యాప్ లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి శ్రీ ప్రసాద్, థమన్ (Thaman) వారి కొత్తదనం పాటలతో చూపిస్తూ దూసుకెళ్లారు. ఆ తర్వాత మణిశర్మ అవకాశాలు కూడా మెల్లిగా తగ్గుతూ వచ్చాయి.
ఒకప్పుడు చిరంజీవి నుంచి ఎంతో మంది అగ్రనటుల సినిమాలకు సంగీతం అందించి.. వాళ్ళ కెరీర్ లో గుర్తుండిపోయే పాటలను ఇచ్చారు మణిశర్మ. అలాంటి ఈయన ప్రస్తుతం చిన్న చిన్న హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మణిశర్మ తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
"పవన్ కళ్యాణ్ (Pawan), మహేష్ బాబు (Mahesh Babu) లాంటి స్టార్ హీరోలు అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వొచ్చు. ఒక ఛాన్స్ నాకు, ఒక ఛాన్స్ థమన్, ఒక ఛాన్స్ దేవికి (DSP) ఇస్తే మ్యూజిక్ విషయంలో ప్రేక్షకులు కూడా వెరైటీగా ఫీల్ అవుతారు. వాళ్లకు రెండు సినిమాలు ఇస్తే.. పోనీ నాకు ఒకటి ఇవ్వండి ఆంటూ మాట్లాడారు. ఇది కేవలం నా మనసులోని మాట మాత్రమే.. నేను వెళ్లి వాళ్ళతో చెప్పలేదు.. ఎవరితోనూ చెప్పలేను అంటూ తన బాధను వ్యక్తం చేశారు మణిశర్మ." రీసెంట్ గా పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్, చిరంజీవి ఆచార్య సినిమాలోని సాంగ్స్ బాగానే ఉన్నప్పటికీ.. అంతగా క్లిక్ అవ్వలేకపోయారు. ఈ ట్రెండ్ తగ్గ సాంగ్స్ చేయడంలో మణిశర్మ కాస్త వెనుకపడ్డారు. ఇది కూడా ఈయన స్టార్ హీరోల ఛాన్సులు మిస్ అవ్వడానికి కారణమై ఉండొచ్చు. ప్రస్తుతం మణిశర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Hi Nanna OTT Release: ఓటీటీలో హాయ్ నాన్న .. రిలీజ్ డేట్ వచ్చేసింది