Video: తెలంగాణ రాష్ట్ర గీతం రెడీ.. ఇండియన్ ఐడల్ రేవంత్ తో పాటు పాడిన ప్రముఖ సింగర్స్ వీరే!

తెలంగాణ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సిద్ధం చేశారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కీరవాణి టీం ఆ గీతాన్ని వినిపించింది. భేటీలో సింగర్లు రేవంత్, లిప్సిక, హారికా నారాయణ్ కూడా పాల్గొన్నారు. దీంతో వారు ఈ పాటకు తమ గాత్రం అందించినట్లు తెలుస్తోంది.

New Update
Video: తెలంగాణ రాష్ట్ర గీతం రెడీ.. ఇండియన్ ఐడల్ రేవంత్ తో పాటు పాడిన ప్రముఖ సింగర్స్ వీరే!

తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకు ప్రముఖ సింగర్ రేవంత్, లిప్సిక, హారికా నారాయణ్ తో పాటు పలువురు సింగర్లు సైతం హాజరయ్యారు. దీంతో కీరవాణితో కలిసి వీరంతా ఈ పాటను పాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఇప్పటికే రికార్డ్ చేసిన వెర్షన్ ను రేవంత్ రెడ్డికి కీరవాణి వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ చిన్న చిన్న సూచనలు చేసినట్లు సమాచారం. ఆ సూచనలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ వెర్షన్ ను కీరవాణి సారథ్యంలో రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న ఈ పాటను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.

మరో వైపు కీరవాణికి తెలంగాణ గేయానికి సంబంధించిన సంగీతం అందించే బాధ్యతలు అప్పగించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీకి చెందిన వ్యక్తి తెలంగాణ పాటకు సంగీతం అందించడం ఏంటని వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే తెలంగాణ గీతానికి సంగీతం అందించే బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు