ఎయిరిండియా పై అసహనం వ్యక్తం చేసిన రికీ కేజ్!

మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ ఎయిరిండియా విమాన సర్వీసుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయంలో ఎయిరిండియా ఉద్యోగి ఒకరు తనతో అ గౌరవపరిచే విధంగా మాట్లాడినట్లు ఆయన ఎక్స్ లో తెలిపారు.ఎయిరిండియా సిబ్బింది తనతో ఇలా ప్రవర్తించటం 3వసారని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.

New Update
ఎయిరిండియా పై అసహనం వ్యక్తం చేసిన రికీ కేజ్!

ప్రముఖ సంగీత స్వరకర్త రికీ కేజ్ ఈ ఉదయం ముంబై నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయంలో వేచి చూస్తు ఉన్నారు. ఆ సమయంలో ఎయిరిండియా ఉద్యోగి ఒకరు  రికీ కేజ్‌ను అగౌరవపరిచే విధంగా మాట్లాడినట్లు  X సైట్‌లో తన నిరాశను వ్యక్తం చేశాడు.నాకు ఈ సంవత్సరంలో నాకు ఇలా జరగడం ఇది 3వ సారి. నేను బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడానికి టికెట్ బుక్ చేసుకున్నాను. బెంగళూరు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వెళ్లాను. కౌంటర్‌లోని నిషితా సింగ్ అనే ఉద్యోగి నన్ను ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లమని అడిగారు. చాలా అగౌరవంగా ప్రవర్తించారు. తమ కంపెనీలో ఏం జరుగుతుందో ఎయిర్ ఇండియాకు తెలియాల్సి ఉంది. నేను ఇంకా విమానాశ్రయంలోనే ఉన్నాను. అయితే విమానం 9.25 గంటలకు బయలుదేరిందని ఆయన తెలిపారు. అలాగే, తనకు ఎంత డబ్బు తిరిగి వస్తుందని, దీనికి ఏం చేయాలని బాధితుడు ప్రశ్నించాడు.

అతని పోస్ట్‌పై స్పందిస్తూ, ఎయిరిండియా వారు మీకు పరిష్కారాన్ని అందించమని సందేశం పంపారని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం జరగలేదని, ఎయిరిండియా అబద్ధాలు చెబుతోందని రికీ గేజ్ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు