BREAKING: మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్

TG: హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ జారీ చేశారు అధికారులు. వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తనున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

New Update
BREAKING: మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్

Hyderabad Alert:హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇళ్లు ఖాళీ చేయాలని డీఆర్ఎఫ్‌ బృందాల హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తిగా నిండాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో జలాశయాల గేట్లను అధికారులు ఎత్తనున్నారు. ముఖ్యంగా చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసానగర్‌ ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు.

మరో నాలుగు రోజులు...

తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతిదిశగా వంగి ఉందని.. రాబోయే రెండురోజుల్లో ఉత్తర దిశగా వైపు కదులుతుందని వాతావరణశాఖ ప్రకటించింది.

ఇక రుతుపవన ద్రోణి సూరత్‌గఢ్‌, రోహ్‌తక్‌, ఒరై, మండ్లా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలోని అల్పపీడన కేంద్రం నుంచి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ పేర్కొంది. తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు భారీ వర్షసూచన ఉన్న జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు