/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandragiri-.jpg)
ఏపీలో ఎన్నికలు ముగిసి 16 గంటలు కావొస్తున్నా.. ఆందోళనలు మాత్రం ఇంకా ఆగడం లేదు. తాజాగా తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. వైసీపీ నేత భాను అనుచరులు సుత్తి, రాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. ఆయన గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. దీంతో పులివర్తి నాని గన్‌మెన్ గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పద్మావతి వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పులివర్తి నాని అనుచరులు సైతం వైసీపీ నేతలు వచ్చిన కార్లను ధ్వంసం చేశారు. యూవర్సిటీలో పులివర్తి నాని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.