/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chalamala-Krishnareddy-jpg.webp)
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చలమల కృష్ణారెడ్డి (Chalamala Krishna Reddy) బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చలమల కృష్ణారెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయన టికెట్ కు బ్రేక్ పడింది. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ కావడంతో చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. రాజగోపాల్ రెడ్డి మరో చోట పోటీ చేసి.. మునుగోడు తనకు వదిలి పెట్టాలని కోరారు.
ఇది కూడా చదవండి:TS Elections 2023: కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఎం కటీఫ్.. కారణమిదే?
కానీ.. హైకమాండ్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో పార్టీ వీడాలని చలమల డిసైడ్ అయ్యారు. ఇదే అదనుగా బీజేపీ చలమలను పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చిన రాజగోపాల్ రెడ్డిపై చలమల కృష్ణారెడ్డిని బరిలోకి దించి ఓడించాలన్న వ్యూహంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
మరో వైపు నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత పాల్వాయి స్రవంతి కూడా హైకమాండ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీని నాశనం చేయాలన్న లక్ష్యంతో బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మళ్లీ ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరో కీలక నేత కైలాష్ కూడా ఆమెతో కలిసి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేతలంతా రాజగోపాల్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేసే అవకాశం ఉంది.