/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/womens-jpg.webp)
vijayawada: విజయవాడలో ఓ పక్క కౌన్సిల్ సమావేశం జరుగుతుంటే మరోపక్క మున్సిపల్ కార్మికులు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉన్నప్పుడు విధులు నిర్వర్తించిన పోటీ మున్సిపల్ కార్మికులు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తాము వివిధ పనులు చేస్తుంటే వీఎంసీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు పని చేస్తే నేటికీ వేతనం చెల్లించలేదని వాపోతున్నారు.
Also Read: బీఆర్ఎస్ అక్రమాలపై యాక్షన్ ఎక్కడ? తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు
నేటి నుంచి పనులకు రానివ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించమని ముందు చెప్పిన అధికారులు నేడు పనులకు రావొద్దని విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేరే పని చేస్తున్న తమను ఉపాధిని కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఇలా తీసేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు ఉపాధి కోల్పోయిన కార్మికులు.
Also Read: రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..!
మున్సిపల్ కార్మికులుగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న క్రమంలో తమను ఉద్యోగాల నుంచి తొలగించమని వీఎంసీ అధికారులు చెప్పారని మండిపడుతున్నారు. ఒక నెల పనులు చేసిన తమను జీవితం ఇవ్వకుండా ఇప్పుడు ఎలా విధుల నుంచి తొలగిస్తారని కార్మికుల ఫైర్ అవుతున్నారు.